Begin typing your search above and press return to search.

క‌మ్మ ఎన్నారైల సైలెన్స్ వెనుక కార‌ణాలేంటో?

By:  Tupaki Desk   |   13 April 2021 8:00 AM IST
క‌మ్మ ఎన్నారైల సైలెన్స్ వెనుక కార‌ణాలేంటో?
X
క‌మ్మ సామాజిక వ‌ర్గం... ఎవ‌రెన్ని చెప్పినా... అన్ని రంగాల్లో వారిదే అందె వేసిన చెయ్య‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. వ్యాపార రంగ‌మైనా, సినిమా రంగ‌మైనా... చివ‌ర‌కు రాజ‌కీయ రంగ‌మైనా కూడా వారిదే పైచేయి. టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఏపీకి సీఎంగా ఉన్న స‌మ‌యంలో ఈ వ‌ర్గం త‌మ‌దైన శైలిలో చ‌క్రం తిప్పేవారు. తెలుగు రాష్ట్రాల్లో ప‌రిస్థితి ఇలా ఉంటే... విదేశాల్లో మ‌న తెలుగు వారు అధికంగా ఉండే ప్రాంతాల్లో కూడా వీరిదే అందె వేసిన చెయ్యి. ప్ర‌వాసాంధ్ర సంఘాల్లో వీరిని మించిన వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. విదేశాల్లో స్థిర‌ప‌డ్డ అన్ని వ‌ర్గాల్లో కూడా క‌మ్మ వ‌ర్గమే ఆధిప‌త్యం చెలాయించే ప‌రిస్థితి. ఇందుకు ఆయా రంగాల్లో స‌ద‌రు సామాజిక వ‌ర్గం వ్య‌క్తులు సాధిస్తున్న పురోగ‌తే నిద‌ర్శ‌న‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయితే ఎందుక‌నో గాని గ‌డ‌చిన రెండేళ్ల నుంచి ఈ వ‌ర్గం పూర్తి స్థాయిలో సైలెంట్ అయిపోయింది. ఎక్క‌డ కూడా ఈ వర్గానికి చెందిన వారు ముందుకు వ‌స్తున్న ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు విదేశాల్లో కూడా ఇప్పుడు క‌మ్మ వ‌ర్గం మాటే వినిపించ‌డం లేదు.

క‌మ్మ సామాజిక వ‌ర్గం ప్ర‌ధానంగా ఏపీలోని కొన్ని జిల్లాలకు చెందిన వ‌ర్గ‌మే అయినా... కాల‌క్ర‌మేణా రాష్ట్ర‌వ్యాప్తంగా వారు విస్త‌రించారు. వ్యాపార‌, వాణిజ్య‌, రాజ‌కీయ రంగాల్లో త‌మ‌దైన శైలిలో దూసుకువెళుతున్నారు. ఇప్పుడు ఏపీలోని దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ ఈ వ‌ర్గం త‌మ ఉనికిని బ‌లంగానే చాటుకుంటోంది. ఇక తెలంగాణ‌లోనూ ఈ వ‌ర్గం చాలా కాలం క్రిత‌మే పాగా వేసినా... ఉమ్మ‌డి రాష్ట్రానికి చంద్ర‌బాబు సీఎం అయ్యాక వీరి ఉనికి విస్ప‌ష్టంగా క‌నిపించ‌డం మొద‌లైంది. ప్ర‌త్యేకించి హైద‌రాబాద్ లోని జూబ్లీ హిల్స్‌, బంజారా హిల్స్ వంటి ప్రాంతాల్లో విలువైన స్థ‌లాల‌ను కొనుగోలు చేసిన ఈ వ‌ర్గం వ్య‌క్తులు... జంట న‌గ‌రాల్లో వ్యాపారాల‌ను కూడా విస్తృతం చేసుకున్నారు. వెరసి జంట న‌గ‌రాల్లో కూడా బ‌ల‌మైన వ‌ర్గంగానే క‌మ్మ వ‌ర్గం త‌న ఉనికిని చాటుకుంది. ఇందుకు చంద్ర‌బాబు ఓ మోస్త‌రు స‌హ‌కారం అందించ‌డం ఓ కార‌ణ‌మైతే... ముందు చూపుతో ఏపీలోని త‌మ ఆస్తుల‌ను అమ్మేసుకుని, హైద‌రాబాద్ తో పాటు అభివృద్ధికి అవ‌కాశం ఉన్న ప‌లు ప్రాంతాల్లో ఈ వ‌ర్గం పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసింది. ఫ‌లితంగా తెలుగు నేల వ్యాప్తంగా కూడా క‌మ్మ సామాజిక వ‌ర్గం త‌మ‌కంటూ ఓ ప్ర‌త్యేక ముద్ర‌తో పాటుగా అన్ని రంగాల్లోనూ త‌న‌కంటూ ఎద‌రులేద‌ని నిరూపించుకుంది.

అయితే... ఎందుక‌నో గానీ... గ‌డ‌చిన రెండేళ్ల నుంచి క‌మ్మ సామాజిక వ‌ర్గం ఏ రంగంలోనూ గ‌తంలో మాదిరిగా దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌డం లేదు. ఏపీలో రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎం అయ్యాక‌... క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని ఆయ‌న త‌న ప్ర‌త్య‌క్ష శ‌త్రువుగానే ప‌రిగ‌ణిస్తున్న‌ట్లుగా ప‌లు ప్రక‌ట‌న‌లు చేయ‌డం, ఆ త‌ర్వాత రాజ‌ధాని అమ‌రావ‌తిలో క‌మ్మ వ‌ర్గం భారీ దోపిడీకి పాల్ప‌డిందంటూ ద‌ర్యాప్తుల మీద ద‌ర్యాప్తుల‌కు తెర తీయం... తదిత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో క‌మ్మ వ‌ర్గం ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నారైల నుంచి అభివృద్ధి ప‌నులు సాగాలంటే... క‌మ్మ వ‌ర్గం లేనిదే ఆ ప‌ని జ‌రిగే అవ‌కాశం లేదు. ఈ కార‌ణంగానే... గ‌తంలో జ‌రిగిన మాదిరిగా గ‌డ‌చిన రెండేళ్ల నుంచి తెలుగు రాష్ట్రాల‌కు ఎన్నారైల నిధులే రావ‌డం లేదు. తెలంగాణ‌కు ఓ మోస్త‌రుగా ప్ర‌వాసాంధ్రులు స‌హ‌క‌రిస్తున్నా... ఏపీ వైపు మాత్రం క‌న్నెత్తి కూడా చూడ‌టం లేదు. దీనికి క‌మ్మ వ‌ర్గం సైలెన్సే కార‌ణ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. గ‌తంలో చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌గా... ఏపీకి ఎన్నారైల నుంచి పెద్ద ఎత్తున సాయం అందేది. ప‌లు గ్రామాల‌తో పాటు పెద్ద ఎత్తున ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను ద‌త్త‌త తీసుకుని మ‌రీ ప్ర‌వాసాంధ్రులు అభివృద్ది ప‌నులు చేసేవారు. అయితే జ‌గ‌న్ సీఎం కాగానే... ఈ ప‌నుల‌న్నీ ఆగిపోగా... ఏపీకి ప్ర‌వాసాంధ్రుల నుంచి సింగిల్ పైసా కూడా విడుద‌ల కావ‌డం లేదు. మ‌రి దీనికి కార‌ణంగా జ‌గ‌న్ సీఎం కావ‌డమా? లేదంటే మ‌రే కార‌ణ‌మో తెలియ‌దు గానీ... ప్ర‌వాసాంధ్రులు మ‌ళ్లీ యాక్టివ్ కావాలంటే... క‌మ్మ వ‌ర్గం సైలెన్స్ వీడాల్సిందేన‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.