Begin typing your search above and press return to search.

థర్డ్ వేవ్ : వచ్చే 125 రోజులు అత్యంత క్లిష్టంగా ఉంటాయట !

By:  Tupaki Desk   |   17 July 2021 5:57 AM GMT
థర్డ్ వేవ్ : వచ్చే 125 రోజులు అత్యంత క్లిష్టంగా ఉంటాయట !
X
మనదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ సమయంలో కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం ముంచుకొస్తోందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చిరికలు జారీ చేసింది. దేశంలో కరోనా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తగ్గిపోలేదని, రాబోయే 125 రోజులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. కరోనా వైరస్ కు వ్యతిరేకంగా మనదేశం ఇంకా హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించలేదని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ సంక్రమణ కొత్త వ్యాప్తి అవకాశాలను తోసిపుచ్చలేమని, వైరస్‌ వ్యాప్తికి రాబోయే 125 రోజులు కఠినమైనవే అని సూచించింది. దీనితో వచ్చే 125 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ హెచ్చరించారు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలంటే, అనుకూలమైన ప్రవర్తను అలవాటు చేసుకోవడం, కఠినమైన పద్దతులు పాటించడం ద్వారా సాధ్యమవుతుందంటూ ఆయన వెల్లడించారు. మనం ఇంకా హెర్డ్‌ ఇమ్యూనిటీని సాధించలేదని, ప్రస్తుతం వైరస్‌ లో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ముందుగా వాటిని మనం అడ్డుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అనేక దేశాలలో కరోనా పరిస్థితి మరింత దిగజారిపోతోందని వీకే పాల్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచం థర్డ్‌ వేవ్‌ వైపు పయనిస్తోందంటూ హెచ్చరించారు.

ప్రస్తుతం వైరస్‌ లో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మనం వాటిని అడ్డుకోవాలి. సురక్షితమైన జోన్‌లో ఉండటానికి కోవిడ్ కట్టడికి అనుకూలమైన ప్రవర్తనను అనుసరిస్తే ఇది సాధ్యమవుతుంది అన్నారు. అనేక దేశాలలో కరోనా వైరస్ పరిస్థితి మరింత దిగజారిపోతోందని, ప్రపంచం థర్డ్‌ వేవ్‌ వైపు పయనిస్తోంది అని డాక్టర్ పాల్ హెచ్చరించారు. మనదేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకోవడానికి మేం సెకండ్‌ వేవ్‌, థర్డ్‌ వేవ్ మధ్య ఉన్న సమయం వినియోగించుకుంటున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్‌ హెచ్చరికను జారీ చేసింది. దాని నుంచి మనం నేర్చుకోవాలి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఇతర దేశాలతో థర్డ్‌ వేవ్ గురించి చర్చించారు అని డాక్టర్‌ పాల్‌ తెలిపారు.

కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. పొరుగు దేశాలలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగి పోతున్నాయని అన్నారు. మయన్మార్, ఇండోనేషియా, మలేషియా, బంగ్లాదేశ్‌ లల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయని వెల్లడించారు. ఆయా దేశాల్లో సెకండ్ వేవ్ కన్నా థర్డ్‌ వేవ్‌ ప్రభావం అధికంగా ఉందన్నారు. కరోనా మహమ్మారి కట్టడికి సంబంధిత ఆంక్షలు సడలించినప్పటి నుంచి భారతదేశంలో మాస్క్‌ల వాడకం బాగా క్షీణించిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. లాక్‌డౌన్‌ తర్వాత దేశంలో మాస్క్‌ వాడకంలో 74 శాతం తగ్గుదల నమోదవుతున్నట్లు అంచనా వేసింది.

తాజాగా ఐసీఎంఆర్ సైంటిస్ట్ థర్డ్ వేవ్ దీనిపై స్పష్టత ఇచ్చారు. మూడో వైవ్ ఆగస్టులో వస్తుందని చెప్పారు. అంతేకాదు క్రమంగా రోజుకు లక్ష కేసుల చొప్పున నమోదు అవుతాయని ప్రొఫెసర్ సమిరన్ పాండా అన్నారు. అయితే పరిస్థితి మాత్రం ఫస్ట్ వేవ్ మాదిరిగానే ఉంటుందని వివరించారు. కానీ తర్వాత పరిస్థితి మారే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఐసీఎంఆర్‌ లో ఎపిడెమోలాజీ, సంక్రమణ వ్యాధు విభాగానికి పాండా అధిపతిగా ఉన్నారు. సిచుయేషన్ ఎలా దిగజారుతుందని ప్రశ్నిస్తే, ఐసీఎంఆర్, లండన్ ఇంపిరీయల్ కాలేజీ చేసిన పరిశోధనను వివరించారు. తక్కువగా వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కూడా కేసులు పెరగవచ్చని, కానీ సెకండ్ వేవ అంత తీవ్రంగా ఉండకపోవచ్చు అని తెలిపారు. సామూహిక సమావేశాలను, మాస్క్ ధరించకపోవడం వల్ల ఇన్ ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్ మందగించిందని.. ఇదీ ప్రమాదం అని పాండా తెలిపారు. పర్యాటకులను అనుమతి ఇవ్వడం, ఇతర ప్రాంతాలకు జనం చేరడంతో ఇబ్బందులు తప్పవని చెప్పారు. ఇప్పుడు డెల్టా వెరియంట్ ద్వారా 86 శాతం మందికి ఇన్ ఫెక్షన్ వస్తుందని వివరించారు.