Begin typing your search above and press return to search.

థ‌ర్డ్ వేవ్ ఇలా ఉంటుంద‌ట‌.. కాన్పూర్‌ ఐఐటీ రిపోర్టు

By:  Tupaki Desk   |   22 Jun 2021 11:30 PM GMT
థ‌ర్డ్ వేవ్ ఇలా ఉంటుంద‌ట‌.. కాన్పూర్‌ ఐఐటీ రిపోర్టు
X
దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే అదుపులోకి వ‌స్తోంది. ప‌లు రాష్ట్రాలు పూర్తిగా లాక్ డౌన్ ఎత్తేయ‌గా.. మ‌రికొన్ని స‌డ‌లింపులు ఇస్తూ కొన‌సాగిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఆ రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ ఎత్తేసే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. అయితే.. థ‌ర్డ్ వేవ్ ఉంటుంద‌నే హెచ్చ‌రిక‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో దేశ ప్ర‌జ‌ల్లో భ‌యం అలాగేఉంది. అయితే.. థ‌ర్డ్ వేవ్ ఎప్పుడు మొద‌ల‌వుతుంది? దాని తీవ్రత ఎంత? పిల్లల మీద ప్రభావం ఉంటుందా ఉండదా? ఇలా.. ఎన్నో సందేహాలైతే మిగిలే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో కాన్పూర్ ఐటీటీ బృందం.. తాము అధ్య‌య‌నం చేశామంటూ, అంచ‌నా వేశామంటూ రిపోర్టు బ‌య‌ట పెట్టింది.

ఈ రిపోర్టు ప్ర‌కారం.. థ‌ర్డ్ వేవ్ అక్టోబ‌ర్ నాటికి తీవ్ర‌స్థాయికి చేరుతుంద‌ట‌. ఇందులో ఊపిరి పీల్చుకునే అంశం కూడా ఉంది. సెకండ్ వేవ్ అంత తీవ్రంగా థ‌ర్డ్ వేవ్ ఉండ‌ద‌ని ఈ అధ్య‌య‌నంలో పాల్గొన్న‌వారు వారు ఘంటాప‌థంగా చెబుతున్నారు. ఒక‌వేళ త‌మ అంచ‌నా త‌ప్పి, తీవ్ర‌త ఎక్కువ ఉంటే గ‌న‌క‌.. అది సెప్టెంబ‌ర్ లోపే క‌నిపిస్తుంద‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. జ‌నాలు లైట్ తీసుకొని, కొవిడ్ నిబంధ‌న‌లు ప‌ట్టించుకోకుండా తిరిగితే మాత్రం సెకండ్ వేవ ముగియ‌కుండానే.. థ‌ర్డ్ వేవ్ మొద‌లు అవుతుంద‌ని హెచ్చ‌రించారు. వ్యాక్సినేష‌న్ తో సంబంధం లేకుండా తాము ఈ అధ్య‌య‌నం చేసిన‌ట్టు వారు చెబుతున్నారు.

ఒక వేళ వ్యాక్సినేష‌న్ వేగం పుంజుకొని, సాధ్య‌మైనంత ఎక్కువ మందికి అందిస్తే మాత్రం.. థ‌ర్డ్ వేవ్ తారస్థాయి ప్ర‌భావం త‌గ్గుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ లెక్క ప్ర‌కారం.. జ‌నాలు నిర్ల‌క్ష్యానికి తావు ఇవ్వ‌కుండా.. మాస్కులు, శానిటైజేష‌న్‌, భౌతిక దూరం పాటిస్తే.. థ‌ర్డ్ వేవ్ నుంచి త‌క్కువ న‌ష్టంతో బ‌య‌ట‌ప‌డొచ్చ‌ని అర్థ‌మ‌వుతోంది. మ‌రి, మ‌న భార‌తీయులు ఏమంటారో..?