Begin typing your search above and press return to search.

అప్పుడే పోయిందనుకుంటున్నారా.. థర్డ్ వేవ్ షురూ కాబోతుంది ... ఐఎంఎస్‌సీ వార్నింగ్..

By:  Tupaki Desk   |   13 July 2021 4:18 AM GMT
అప్పుడే పోయిందనుకుంటున్నారా.. థర్డ్ వేవ్ షురూ కాబోతుంది ...  ఐఎంఎస్‌సీ వార్నింగ్..
X
కరోనా వైరస్..కరోనా వైరస్..గత కొన్ని నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా ఇదే పేరు. కరోనా దెబ్బకి ప్రపంచం మొత్తం అస్తవ్యస్తం అయ్యింది. ప్రపంచంలోని ప్రతి దేశం కూడా కరోనా జోరు కి బ్రేకులు వేయలేక చేతులెత్తేసింది. చైనాలోని వుహాన్ సిటీలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి ఆ తర్వాత అన్ని దేశాలకి వ్యాప్తి చెందుతూ మొత్తం ప్రపంచాన్ని చుట్టేసింది. ప్రాణాంతక కరోనా వైరస్ బారి నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కుదురుకుంటోంది. ఇక మనదేశంలో కూడా ఫస్ట్ వేవ్ , సెకండ్ వేవ్ అంటూ నానా రచ్చ చేసిన కరోనా రక్కసి , ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతూ వస్తుంది. మనదేశంలో రోజువారీ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా మరణాలూ కూడా కొంచెం తగ్గాయి , గతంలో మాదిరి భయాందోళనకు గురి చేయట్లేదు.

ఇక , నిన్నటి కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. దేశంలో 37,154 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 724 మంది మరణించారు.ఈ లెక్కల్ని బట్టి చూస్తే .. కరోనా వైరస్ అదుపులోనే ఉందనే సంకేతాలను పంపిస్తోన్నాయి ఈ అంకెలు. ఫలితంగా అన్ని రాష్ట్రాలు కరోనా వైరస్ ఆంక్షలను సడలించాయి. దేవస్థానాలు, పర్యాటక కేంద్రాలకు ద్వారాలు తెరిచాయి. కరోనా విజృంభణ సమయంలో సంపూర్ణ లాక్ డౌన్ అంటూ ఒక రాష్ట్రము రాష్ట్రానికి వెళ్లడానికి వీలు లేకుండా చేశారు. అలాగే , రాష్ట్రంలో కూడా కట్టుదిట్టమైన లాక్ డౌన్స్ , కర్ఫ్యూ లు అమలు చేశారు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో మళ్లీ అన్ని ఓపెన్ చేస్తున్నారు.

అయితే, రాష్ట్రాల మధ్య యథేచ్ఛగా రాకపోకలు సాగించే వాతావరణం ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. దేశం మరోసారి లాక్‌ డౌన్ తరహా పరిస్థితుల్లోకి జారిపోవడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ మునుపట్లా లక్షల సంఖ్యలో నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు. దీనికి కారణం, దేశంలో క్రమంగా కరోనా మహమ్మారి ఆర్, వేల్యూ పెరుగుతోండటమే. జూన్ మొదటి వారంతో పోల్చుకుంటే, రెండో వారంలో ఆర్ వేల్యూ ఆందోళనకరం గా పెరిగిందని నిపుణులు హెచ్చరిస్తోన్నారు. కరోనా వైరస్ మహమ్మారి రీప్రొడక్టివిటీని నిపుణులు ఆర్ వేల్యూగా భావిస్తారు.

ముందు జాగ్రత్త చర్యలను తీసుకునే విషయంలో నెలకొన్న అశ్రద్ధ దీనికి కారణమౌతోందని చెప్తున్నారు. మనకు మనమే సూపర్ స్ప్రెడర్లుగా మారుతోన్నామని చెప్తున్నారు. కరోనా ఆర్ వేల్యూ పెరుగుదలపై చెన్నైలోని ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ సైన్సెస్ (ఐఎంఎస్‌సీ) సైంటిస్టులు చేసిన పరిశోధనల ఫలితాలు థర్డ్‌ వేవ్ ముప్పును సూచిస్తోన్నాయి. ఐఎంఎస్‌సీ కంప్యుటేషనల్ బయాలజీ డీన్, ఫిజిక్స్ ప్రొఫెసర్ సితభ్ర సిన్హ నేతృత్వంలోని సైంటిస్టుల టీమ్ కరోనా ఆర్-వేల్యూపై అధ్యయనం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటి పరిస్థితులు అంటే.. సెకెండ్ వేవ్ ప్రారంభానికి ముందు కరోనా వైరస్ రీప్రొడక్టివిటీ వేల్యూలో ఏ స్థాయిలో పెరుగుదల కనిపించిందో.. అలాంటి తీవ్రతే ఇప్పుడూ ఉందని హెచ్చరించారు.

ఫిబ్రవరిలో 0.93గా ఉన్న ఆర్ వేల్యూ క్రమంగా 1.02కు పెరిగడం సెకెండ్ వేవ్‌కు దారి తీసింది. ఏప్రిల్‌లో గరిష్ఠంగా 1.31కు చేరింది. ఇప్పుడు కూడా కరోనా ఆర్ వేల్యూ పెరుగుతోందని, కిందటి నెల 30వ తేదీ నాటికి 0.78గా ఉన్న ఈ సంఖ్య ప్రస్తుతం 0.88కు చేరిందని సితభ్ర సిన్హ తెలిపారు. ఫస్ట్ వేవ్ అంటే తెలీకుండా వచ్చింది. మన నిర్లక్ష్యం.. ముందు జాగ్రత్త లేకపోవడం సెకండ్ వేవ్‌కు కారణమైంది. ఇక మూడో సారి కరోనా దాడి చేసిందంటే.. ఎవరిది బాధ్యత. మొదటి, రెండో దశలో ఏం గుణ పాఠాలు నేర్చుకున్నాం. గత కొంతకాలంగా కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతూ వస్తోంది.

మే 15 నుంచి జూన్‌ 20 వరకు దేశంలో కరోనా కేసులు తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా ఆంక్షలు సడలిస్తున్నారు. మన రాష్ట్రంలోనూ ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు సడలింపులు ఇచ్చారు. అయితే కేసుల సంఖ్య మన రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పడుతున్నా… దేశంలోని కేరళ, మహారాష్ట్రసహా పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. దీంతో మూడో వేవ్ కూడా వచ్చే ప్రమాదం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.