Begin typing your search above and press return to search.

టెస్ట్ డ్రైవ్ అంటూ 'కీ' తీసుకోని అటునుండి అటే ... చిత్తూరులో నయా దొంగల గుట్టురట్టు !

By:  Tupaki Desk   |   30 Oct 2020 2:30 AM GMT
టెస్ట్ డ్రైవ్ అంటూ కీ తీసుకోని అటునుండి అటే ... చిత్తూరులో నయా దొంగల గుట్టురట్టు !
X
ప్రస్తుతం దొంగలు అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని , ఎలా ఈజీగా దొంగతనం చేయాచ్చు అని ప్లాన్ చేసుకొని , రోజుకొక విదంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజా చిత్తూరు లో కొత్త తరహా చోరీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కొన్ని ఆన్ ‌లైన్ యాప్స్ ‌లో సెకండ్ హ్యాండ్ వాహనాల ప్రకటనలను చూసి వాహన యజమానులకు ఫోన్‌ చేసి, వారితో మాటలు కలిపి , తనకు బైక్ కావాలని, ఖచ్చితంగా కొంటానని నమ్మించి వారిని కలుస్తాడు. ఆ తర్వాత టెస్ట్ డ్రైవ్ చేస్తానంటూ బైక్ తీసుకుని ,అటునుండి అటే ఉడాయిస్తాడు. ఇలా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం .. తమిళనాడుకి చెందిన ఇద్దరు వ్యక్తులు, మురకంబట్టుకు చెందిన మరో వ్యక్తి తమ బైక్‌ లు అమ్ముతామంటూ ఆన్‌ లైన్ యాప్‌ లో పోస్ట్ చేశారు. ఆ ప్రకటన చూసిన జిల్లాలోని యాదమరి మండలం సామిరెడ్డిపల్లెకు చెందిన పవన్ కుమార్ బైకులు కొంటానని వారికి ఫోన్ చేసి నమ్మించాడు. వారితో ఒప్పందం కుదుర్చుకుని టెస్ట్ డ్రైవ్ చేస్తానంటూ బైక్ తాళం అడిగి తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. అలా ముగ్గురి వద్ద నుంచి టెస్ట్ డ్రైవ్ పేరుతో వాహనాలని తీసుకోని అక్కడి నుండి జంప్ అయ్యాడు. ఆ బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో చిత్తూరు వన్‌ టౌన్ పోలీసులు నిఘా పెట్టారు. బైకులతో పరారవుతున్న యువకుడిని పవన్‌ గా గుర్తించారు. నిందితుడు ఇరువారం సమీపంలోని బాలాత్రిపురసుందరి దేవి ఆలయం వద్ద ఉన్నట్లు సమాచారం అందడంతో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి ఖరీదైన బైకులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌ కి తరలించారు.