Begin typing your search above and press return to search.

పోలీస్ స్టేషన్ లో పడ్డ దొంగలు...రూ.8 లక్షలు దోపిడీ!

By:  Tupaki Desk   |   17 March 2021 1:34 PM GMT
పోలీస్ స్టేషన్ లో పడ్డ దొంగలు...రూ.8 లక్షలు దోపిడీ!
X
ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే వెళ్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేస్తారు. కానీ, పోలీసులకే సమస్య వస్తే ఎవరికి కంప్లైంట్ చేయాలి. ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గుచేటు. సెక్యూరిటీ ఉండే బ్యాంకులు, కొన్ని ఇళ్లలో చోరీ జరగడం మనం చూస్తుంటాం. కానీ ఏకంగా పోలీస్ స్టేషన్ కే కన్నం వేయడం ఎక్కడైనా చూశారా.. కానీ ఇలాంటి వింత ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే పశ్చిమగోదావరి జిల్లా వీరసావరంలో రెండు రోజుల క్రితం ఎక్సైజ్ సిబ్బంది రూ.8లక్షల నగదును పోలీస్ స్టేషన్ లో ఉంచారు. రెండురోజులు బ్యాంకులకు సెలవులు కావడంతో నాలుగు వైన్ షాపులకు చెందిన నగదును పోలీస్ స్టేషన్ లో ఉంచారు.

సోమవారం - మంగళవారం బ్యాంకులకు సెలవులు కావడంతో బుధవారం నాడు డబ్బు తీసుకెళ్లి బ్యాంకులో జమ చేయాలని భావించారు. తీరా బుధవారం ఉదయం నగదు తీసుకెళ్లేందుకు రాగా.. మాయమైంది. దీంతో షాక్ కు గురైన పోలీసులు, ఆ డబ్బు ఎక్కడికి పోయిందనేదానిపై పోలీస్ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. నిత్యం భద్రత నడుమ ఉండే పోలీస్ స్టేషన్ లో నగదు మాయం కావడం సర్వత్రా చర్చీనీయాంశమైంది. ఐతే పోలీస్ స్టషేన్లో నిజంగా దొంగలు పడ్డారా.. లేక ఇంటిదొంగలే చేతివాటం చూపారా అనేది మిస్టరీగా మారింది. డబ్బులు పెట్టిన బ్యాగ్ ఎలా మయమైందో తెలియక తికమక పడుతున్నారు. మరోవైపు పోలీస్ స్టేషన్లో నగదు మాయం కావడంపై జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారని తెలుస్తుంది.