Begin typing your search above and press return to search.

ఆ దొంగల ఆస్తులు చూస్తే నోట మాట రాదు

By:  Tupaki Desk   |   9 April 2015 9:07 AM GMT
ఆ దొంగల ఆస్తులు చూస్తే నోట మాట రాదు
X
పేరుకు దొంగలు కానీ.. వారి ఆస్తులు చూస్తే నోట వెంట మాట రాదంతే. ఇంత భారీ ఆస్తిపాస్తులతో దేశవ్యాప్తంగా ముఠాలుగా ఏర్పడి బతికేసే వీరిలో ఇద్దరిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వీరి నోట వెంట వస్తున్న నిజాల్ని వింటున్న పోలీసులు సైతం షాక్‌ తింటున్నారు.

కేవలం రూ.పది నోటుతో దొంగతనం చేసే వీరు తమిళనాడు రాష్ట్రంలోని రాంజీనగరానికి చెందిన వారు. పది రూపాయిల నోట రోడ్డు మీద వేసి.. అయ్యో ఎవరో పడేసేకున్నారని వంగి తీసుకునేలోపల సంచీలు మొదలు.. జేబులు సైతం అత్యంత చాకచక్యంగా కొట్టేసే టాలెంట్‌ వీరి సొంతం.

రాంజీనగర్‌లోని 700 కుటుంబాల్లో 650 కుటుంబాలు దొంగలవే. వీరిని పట్టుకునేందుకు భక్తులుగా వేషాలు వేసుకొని సమాచారం సేకరించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకెళ్లారు. వీరి నోట వెంట వస్తున్న నిజాలు విని పోలీసుల నోట వెంట మాట రాని పరిస్థితి. చెన్నైకి 280కిలోమీట్ల దూరంలో ఉండే రాంజీనగర్‌కు చెందిన ఈ దొంగల ప్రత్యేకత ఏమిటంటే.. నేరుగా చోరీలు చేయకుండా దృష్టి తప్పించి దోచేసుకుంటారు.

ఈ ముఠాలోని సభ్యులు దేశవ్యాప్తంగా 15 ముఠాలుగా ఏర్పడి దొంగతనాలు చేస్తుంటారు. దొంగతనాలు చేసే సమయంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించటం.. కన్నుగప్పి పారిపోవటంలో వీరు సిద్ధహస్తులు. వీరికి సంబంధించిన ఆస్తుల్ని చూసిన వారికి మైండ్‌ పోయే పరిస్థితి.

ఒక్కొక్కరూ రూ.50లక్షలు విలువ చేసే ఇళ్లను నిర్మించుకోవటంతో పాటు.. తాము ఉండే ఊరుకు కాస్త దూరంలో ఏకంగా వంద ఎకరాలు కొనుగోలు చేశారు. దాదాపు 15 నుంచి 20 ఫామ్‌హౌస్‌లను కొనుగోలు చేశారు. అంతేకాదు.. తమను పట్టుకునేందుకు వచ్చే పోలీసుల నుంచి తప్పించుకోవటానికి వీరు కుక్కల్ని ఇళ్లకు కాపలాగా ఉంచటం మరో ప్రత్యేకత.

ఒకసారి ఇంటి నుంచి బయలుదేరితే దాదాపు మూడు నాలుగు నెలల పాటు దొంగతనాల మీద దృష్టి పెట్టే వీరు.. దొంగతనాలకు బయలుదేరే ముందు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లటం.. పూజలు చేయటం లాంటివి చేస్తుంటారు.