Begin typing your search above and press return to search.

మీ ఇంటికొస్తా.. దొంగ‌త‌నం చేస్తా కాస్కోండి: ‌లేఖ‌లు రాసి మ‌రీ దొంగ‌త‌నం

By:  Tupaki Desk   |   9 Jun 2020 1:16 PM GMT
మీ ఇంటికొస్తా.. దొంగ‌త‌నం చేస్తా కాస్కోండి: ‌లేఖ‌లు రాసి మ‌రీ దొంగ‌త‌నం
X
ప‌లానా ప్రాంతంలో.. ప‌లానా ఇంట్లో.. ఈ వ‌స్తువు దొంగ‌త‌నం చేయ‌బోతున్నా కాస్కోండి అంటూ ప్ర‌జ‌ల‌కు లేఖ‌లు విడుద‌ల చేసి మ‌రీ దొంగ‌త‌నం చేస్తున్న దొంగ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప‌ట్టుబ‌డ్డాడు. ఈ దొంగ‌డి స్టేలే వేరు. డేట్, ప్లేస్ చెప్పి మరీ దొంగతనాలు చేస్తుండ‌డం ఇత‌డి స్టైల్‌. ఈ క్ర‌మంలో ఏకంగా ఓ బహిరంగ లేఖ రాసి ప‌లానా దొంగ‌త‌నం చేస్తున్న అని బ‌హిరంగ లేఖ విడుద‌ల చేశాడు.

ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు.. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలోని త్రిలోకినగర్‌లో ఆదివారం (జూన్ 8) ఓ కవర్ కనిపించింది. ఏంటా అని తెరిచి చూస్తే.. అందులో ఓ లేఖ కనిపించింది. ఆ లేఖతో పాటు ఒక గాజు, బ్రేస్ లెట్‌ కూడా అందులో ఉన్నాయి. త్రిలోకిలో దొంగతనం చేసేందుకు నేను మరోసారి రాబోతున్నా.. ఈసారి బైక్‌ను దొంగతనం చేయబోతున్నా. జూన్ 9వ తేదీన నేనీ దొంగతనం చేయబోతున్నా. ఏం చేస్తారో చేసుకోండి. ఇది నేను చేయబోయే 50వ దొంగతనం.' అని ఆ లేఖలో రాశాడు. ఈ లేఖ స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. గ‌తంలోనే ఈ కాలనీలో దాదాపు 12 దొంగతనాలు జ‌రిగాయి. దీంతో స్థానికులు భ‌యాందోళ‌న చెందారు.

గ‌తంలోనూ ఈ దొంగ ఇలాగే చేశాడు. మీ ఫోర్ వీలర్స్,టూ వీలర్స్‌కు లాక్ వేసుకుని భద్రంగా ఉంచుకోండి అని లేఖలు రాసి జాగ్రత్తలు చెప్పారు. ఆ లేఖ విష‌య‌మై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై విచార‌ణ‌లో భాగంగా ఇప్పటికే త్రిలోకి నగర్‌లో 12 సార్లకు పైగా దొంగతనాలు జరిగినట్టు గుర్తించారు. ఈసారి ఏకంగా బహిరంగ లేఖ రాసి మరీ దొంగతనానికి పాల్పడబోతున్నట్టు ప్రకటించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలోనూ ఇలాగే ఆ దొంగల గ్యాంగ్ త్రిలోకి నగర్‌లో బైక్‌ చోరీలకు పాల్పడింది.

ఈ విష‌య‌మై స్థానిక సీఎస్పీ అశోక్ తివారీ స్పందించి మీడియాతో మాట్లాడారు. కొన్ని నెలల్లో ఇక్కడ రెండు భారీ చోరీలతో పాటు రెండు చిన్నపాటి చోరీలు జరిగాయని తెలిపారు. అయితే నేరం చేసే ముందు ఏ దొంగ‌యినా దాన్ని బ‌య‌ట‌కు చెప్ప‌డ‌ని పేర్కొన్నారు. ఈ లేఖను రాసి స్థానికులను భయపెట్ట‌డానికేన‌ని చెప్పా‌రు.