Begin typing your search above and press return to search.

చికెన్ కొనేందుకు వెళ్లారు.. విషయం కర్ఫ్యూ వరకు వెళ్లింది

By:  Tupaki Desk   |   18 Jan 2023 3:58 AM GMT
చికెన్ కొనేందుకు వెళ్లారు.. విషయం కర్ఫ్యూ వరకు వెళ్లింది
X
ఇద్దరు యువకులు చికెన్ కొనేందుకు చికెన్ షాపుకు వెళ్లిన సందర్భంగా చోటు చేసుకున్న వివాదం.. అంతకంతకూ పెరిగిపోవటమే కాదు.. చివరకు ఆ ఊళ్లో కర్ఫ్యూ పెట్టే వరకు వెళ్లిన ఉదంతం సంచలనంగా మారింది. చిన్న గొడవ చిలికి చిలికి గాలివానలా మారి.. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తలకు కారణమైంది. ఈ మొత్తం ఇష్యూ పోలీసులకు పరీక్షగా మారింది. ఇంతకీ ఈ ఉదంతం చోటు చేసుకున్నదెక్కడన్న విషయంలోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి పరిస్థితి నెలకొంది.

ఆ రాష్ట్రంలోని అలీగఢ్ జిల్లాలో సోమవారం రాత్రి చోటు చేసుకున్న ఒక ఉదంతం.. కర్ప్యూ పెట్టే వరకు వెళ్లటమే కాదు.. భారీ పోలీసు బందో బస్తు పెట్టాల్సిన పరిస్థితి. జిల్లాలోని సరాయ్ సుల్తానీలో ఉన్న చికెన్ షాపు వద్దకు ఇద్దరు యువకులు చికెన్ కొనేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా షాపులోని వ్యక్తికి.. చికెన్ కొనుగోలు చేసేందుకు వెళ్లిన ఇద్దరి యువకుల మధ్య గొడవైంది.

అది కాస్తా కాసేపటికే పెరిగి పెద్దది కావటంతో పాటు.. ఇరువురు రాళ్ల దాడి చేసుకునే వరకు వెళ్లింది. కాసేపటికే ఈ ఉదంతం గురించి ఇరు వర్గాల వారికి తెలీటం.. ఆ వర్గాలకు చెందిన వారు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకోవటం షురూ చేశారు. దీంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్ని తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున ఎంట్రీ ఇవ్వటమే కాదు.. గ్రామంలో కర్ఫ్యూను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అనంతరం.. ఇరు వర్గాల వారిని పిలిచి.. చర్చలు జరిపి శాంతింపచేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ గొడవలో నలుగురు గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికెన్ కొనేందుకు వెళ్లి గొడవపడటం ఏమిటి? అది కాస్తా కర్ఫ్యూ వరకు వెళ్లటం ఏమిటంటూ.. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా షాక్ తింటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.