Begin typing your search above and press return to search.
శబరిమలకు వారు అస్సలు రావొద్దు
By: Tupaki Desk | 10 Nov 2020 12:30 PM ISTదసరా వచ్చిందంటే చాలు.. అయ్యప్ప మాల వేసుకునే వారు ఎక్కువగా కనిపిస్తారు. దసరాకు కాస్త ముందుగా మొదలయ్యే మాలధారణ.. సంక్రాంతి వరకు సాగుతుంది కనుమ పండుగ పూర్తి అయిన రెండు రోజుల వరకు మాత్రమే శబరిమలలో అయ్యప్ప స్వామిని చూసే అవకాశం ఉంటుంది. ఈ సీజన్ లో స్వామి వారి దర్శనం కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది అయ్యప్ప మాల వేసుకోవటం తెలిసిందే.
అత్యంత నిష్టతో మాలాధారణ చేసే అయ్యప్పలు.. స్వామివారి దర్శనం కోసం శబరిమల వెళుతుంటారు. ప్రస్తుతం ఇబ్బంది పెడుతున్న కరోనా నేపథ్యంలో కేరళ సర్కారు కీలక ప్రకటన చేసింది. కోవిడ్ బారిన పడి కోలుకున్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ శబరిమలకు రావొద్దని స్పష్టం చేసింది.అలాంటి వారు వస్తే.. శబరికొండను ఎక్కే వేళలో ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని.. శ్వాస తీసుకోవటంలో సమస్యలు ఎదురుకావటం ఖాయమన్నారు.
శబరిమలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్ 19 నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించాలని కోరింది. అంతేకాదు.. భక్తులు మాస్కులు వాడటం తప్పనిసరి అని.. భౌతికదూరాన్ని పాటించాలని కోరింది. స్వామి దర్శనానికి 24 గంటల ముందు తప్పనిసరిగా నెగిటివ్ రిపోర్టు ఉండాలని స్పష్టం చేసింది. ఈ విషయంలోఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేసింది. శబరిపీఠం నుంచి నీలిమల.. శరణ్ గుత్తి వరకు ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. కరోనా లేని సమయంలోనే.. శ్వాస సంబంధిత సమస్యలతో కొండ ఎక్కే సమయంలో ప్రతి ఏటా పాతిక మంది వరకు మరణిస్తుంటారు. కరోనా నేపథ్యంలో శబరిమలకు వెళ్లే వారు ఆచితూచి అన్నట్లుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.