Begin typing your search above and press return to search.
వాళ్ల దగ్గర కోడిగుడ్డును రూ.500 కొంటున్నారు? ప్రత్యేకత ఇదే
By: Tupaki Desk | 12 Oct 2021 9:51 AM ISTఒక కోడిగుడ్డు ఎంత? అంటే విచిత్రంగా చూసేటోళ్లు చాలామందే ఉంటారు. రూ.10 ఒక్క పైసా కూడా ఎక్కువ లేని పరిస్థితి.ప్రత్యేక పరిస్థితుల్లో మహా అయితే..రెండు.. మూడు రూపాయిలు అదనంగా పెడతారేమో? కానీ.. ఒక కోడి గుడ్డుకు రూ.500 పెట్టి కొనేస్తారా? అంటే.. నో.. నెవ్వర్ అనేస్తారు.కానీ.. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో అందుకు భిన్నమైన సీన్ ఉంది. అక్కడ ముగ్గురు యువకులు అమ్మే కోడి గుడ్డుకు రూ.500 ఇచ్చేందుకు వెనుకాడరు. ఇంతకీ ఆ కోడిగుడ్డుకున్న ప్రత్యేకత ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే.. ఆసక్తికర విషయాలు బోలెడన్ని బయటకు వస్తాయి.
తల్లాడ మండలం రామానుజవరానికి చెందిన నరేంద్ర.. సీతారామిరెడ్డి.. వేణుగోపాల్ రెడ్డి ముగ్గురు గ్రాడ్యుయేట్లు. ఒకరు ఎంబీఏ చేస్తే మిగిలిన ఇద్దరూ బీటెక్ లు పూర్తి చేశారు. ఉద్యోగాల గురించి ట్రై చేయకుండా.. ఉన్న ఊళ్లోనే సరికొత్త రీతిలో వ్యాపారం చేయాలని డిసైడ్ అయ్యారు. సీతారామిరెడ్డికి మూడు ఎకరాల మామిడి తోట ఉంది. అందులోనే కోళ్ల పెంపకానికి సంబందించిన ఒక ప్లాన్ తయారు చేశారు.
రెండేళ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి పెట్టి నాలుగు పెదద వరుస నాటుకోడిపెట్టలు.. ఒక జాతి పుంజు కొనుగోలు చేశారు. వాటితో జాగ్రత్తగా క్రాసింగ్ చేయగా.. గుడ్లు పెట్టాయి. ఆ గుడ్లపై నాటుకోళ్లను పొదిగిస్తున్నారు. ఇలా పిల్లల్ని తయారు చేస్తున్నారు. ఈ ప్రత్యేకమైన గుడ్డును ఒక్కొక్కటి రూ.500చొప్పున అమ్ముతున్నారు. అంతేకాదు.. తమదైన శైలిలో తయారు చేస్తున్న క్రాస్ కోడిపిల్ల (వారం రోజుల పిల్ల)ను రూ.వెయ్యి చొప్పున సేల్ చేస్తున్నారు.
ప్రస్తుతం వారి దగ్గర 5 పుంజులు.. 50 పెట్టెలు.. 50పిల్లలు ఉన్నాయి. తమకొచ్చే ఆదాయంతో మరిన్ని కోళ్లను కొనుగోలు చేయాలన్నది వారి ప్లాన్. ఇప్పటివరకు 1200 పిల్లల్ని అమ్మినట్లుగా ఈ యువకులు చెబుతారు. వీరి వద్ద ఉన్న ఒక్కో పుంజు.. రూ.70వేలు నుంచి రూ.1.5 లక్షల వరకు ధర పలుకుతుందని చెబుతున్నారు. ఆంధ్రాలోని వివిధ ప్రాంతాల నుంచి పుంజులను కొనుగోలు చేసి తెలంగాణ ప్రాంతానికిచెందిన పెట్టలతో క్రాసింగ్ చేయిస్తున్నట్లు చెబుతారు. ఈ క్రాస్ కోడి గుడ్లకు మంచి ధర పలకటమే కాదు.. లాభసాటి వ్యాపారంగా మార్చారు. మొత్తానికి ఈ ఐడియా భలేగా ఉంది కదూ?