Begin typing your search above and press return to search.

వారంతా హైదరాబాద్ ను విడిచి వెళ్లిపోవాలి.. ఎన్నికల సంఘం ఆదేశం

By:  Tupaki Desk   |   30 Nov 2020 1:20 PM IST
వారంతా హైదరాబాద్ ను విడిచి వెళ్లిపోవాలి.. ఎన్నికల సంఘం ఆదేశం
X
గ్రేటర్ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ కు మరో రోజు మాత్రమే సమయం ఉంది. అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పోలింగ్ తేదీ దగ్గరకు వచ్చేసింది. ఎన్నికల్లో వాడీవేడీగా సాగిన ప్రచార అంకం ముగిసింది. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో.. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధి కీలక ప్రకటన చేశారు. ఎన్నికల ప్రచారం ముగిసినందున.. స్థానికేతరులు.. జీహెచ్ఎంసీలో ఓటు లేని వారునగరం విడిచి వెళ్లిపోవాలన్న ఆదేశాలు జారీ చేశారు.

ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా ఆదేశాల్ని చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గ్రేటర్ లో నివసించే వారిలో ఓటు లేని వారు చాలామంది ఉంటారు. అలా అని వారిని వెళ్లిపోమ్మనటం ఎన్నికల సంఘం ఉద్దేశం కాదు. ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ కు వచ్చి.. వివిధ డివిజన్లలో ప్రచారం చేసిన వారు.. వివిధ పార్టీలకు సాయంగా నిలిచిన వారు.. ఇలాంటి వారంతా హైదరాబాద్ మహానగరాన్ని విడిచి వెళ్లాల్సి ఉంటుంది.

అంతే తప్పించి.. గ్రేటర్ పరిధిలో ఓటు లేకుండా స్థిరనివాసం ఉండే వారు నగరాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరం ఉండదన్నది మర్చిపోకూడదు. అయితే.. ఇలాంటి వారంతా ఎన్నికల ప్రక్రియకు.. పార్టీల తరఫున ఎలాంటి పని చేయకూడదన్నది మర్చిపోకూడదు. ఒకవేళ ఎన్నికల సంఘం చేసిన ఆదేశాలకు భిన్నంగా ఎవరైనా ఎన్నికల ప్రచారాన్ని చేపడితే.. వారిపై కేసులు పెడతారని.. అలాంటి వారిపై రెండేళ్ల జైలుశిక్షతో పాటు.. జరిమానా విధించనున్నారు.