Begin typing your search above and press return to search.
ఈ చాయ్ లు చాలా ఖరీదు గురూ.. ఒక్క కప్పుకు లక్షల్లో..!
By: Tupaki Desk | 24 May 2021 5:00 AM ISTఉదయం లేవగానే కప్పు చాయ్ కడుపులో పడనిది ఏ పని తోచదు. ఆఫీస్ ఒత్తడిలో చాయ్ లేనిదే పని చేయలేం. సాయంత్రం వేళ అలా సేదతీరడానికి చేతిలో కప్పు తేనీరు ఉండాల్సిందే. పేద, ధనిక తేడా లేకుండా ఈ తేవియాన్ని స్వీకరిస్తారు. అయితే చాయ్ లో తేడాలుండవు కానీ అందులో వాడే పదార్థాల్లో మాత్రం చాలా వ్యత్సాసం ఉంటుంది. రూ.5 చాయ్ నుంచి రూ.లక్షలు విలువ చేసే తేనీరు ఉంటుంది. నిజమేనండి లక్షల్లో విలువ చేసే ఖరీదైన చాయ్ ఉంటుంది. వాటి గురించి తెలుసు కుందాం రండి.
డా హాంగ్ పావో టీ
తేయాకు పండించే ప్రాంతాలు, సాగు విధానం, సేకరణ, శుద్ధి వంటి ప్రక్రియలతో రుచిలో తేడాలు ఉంటాయి. పుడియాన్ ప్రావిన్స్ లో లభించే డాహాంగ్ పావో టీ పౌడర్ గ్రాముకు రూ.30 వేలు ధర పలుకుతుంది. ఆక్సీకరణ చెందిన ఈ టీ ముదురు రంగులో ఉంటుంది. మింగ్ చక్రవర్తి తల్లి డా హాంగ్ పాపోకు ఈ ఆకులతో చేసిన వైద్యంతో జబ్బు నయమైందని అక్కడి వారు చెబుతుంటారు. అక్కడి ప్రత్యేక వాతావరణ పరిస్థితులు తేయాకు మంచి రుచిని తీసుకువస్తాయి. చక్కటి రుచి, వాసనను కలిగిన ఈ టీకి ప్రత్యేక అభిమానులు ఉంటారు.
డైమండ్ టీ
ప్రపంచంలోనే అతి ఖరీదైన టీ బ్యాగ్ పీజీ టిప్స్ డైమండ్ టీ బ్యాగ్. ఆ సంస్థ 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 280 వజ్రాలు పొదిగిన ప్రత్యేక టీ బ్యాగ్ ను రూపొందించింది. పిల్లలకు సాయం చేయడం కోసం ఈ డిజైన్ రూపొందించి విక్రయించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఒక బ్యాగు సుమారు రూ.11 లక్షలు.
పాండా డంగ్ టీ
పాండాల విసర్జనతో తయారు చేసే పాండా డంగ్ టీకి మంచి డిమాండ్ ఉంటుంది. పాండాలు వెదురు మొక్కలను తింటాయి. వాటి పేడ పోషకాలు, విటమిన్లు, క్యాన్సర్ ని నిరోధించే కారకాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించాయి. ఈ క్రమంలో పాండా డంగ్ తో గ్రీన్ టీని తయారు చేస్తున్నారు. ఖరీదైన చాయ్ లలో ఇదీ ఒకటి. దీని ధర 50 గ్రాములకు రూ.2.5లక్షలు పలుకుతుంది.
వింటేజ్ నార్సిసస్ టీ
పూలు, కలప, చాక్లెట్ కలగలిపిన అద్భుతమైన కాంభినేషన్ లో తయారు చేసిన టీ వింటేజ్ నార్సిసస్. ఇది ప్రపంచవ్యాప్తంగా పేరొందింది. మొగ్గ, ఆకులతో మంచి వాసన లభించడానికి 60 శాతం ఆక్సీకరణకు గురి చేస్తారు. ఈ చాయ్ పై యువతకు మక్కువ ఎక్కువ.
ఎల్లో గోల్డ్ టీ
ఎల్లో గోల్డ్ టీకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ చాయ్ సింగపూర్ లో లభిస్తుంది. కేవలం అక్కడే మాత్రమే దొరికే ఈ ఆకులను ఏడాదికి ఒక్కసారి మాత్రమే కోస్తారు. ఒకే పంటలోనే తేయాకు తయారు చేస్తారు. ఈ టీ బంగారం పులుముకున్నట్లుగా ఉంటుంది. చక్కని రుచితో గొప్ప అనుభూతిని ఇస్తుంది. దీని ధర కిలోకు రూ.4,74,000 పలుకుతుంది.
సిల్వర్ టిప్స్ ఇంపీరియల్ టీ
సిల్వర్ టిప్స్ ఇంపీరియల్ టీని డార్జిలింగ్ లో సాగు చేస్తారు. పరిమిత సంఖ్యలో మాత్రమే ఉత్పత్తి చేస్తారు. పులియబెట్టి పూర్తిగా చేతితోనే తయారు చేస్తారు. సుగంధంతో కూడిన వెండి రంగులో ఉంటుంది. ఈ ఆకులను కోసే సమయంలోనూ ప్రత్యేకత కలదు. పౌర్ణమి వెన్నెల్లో మాత్రమే ఈ ఆకులను కోస్తారని అక్కడి వారు చెబుతున్నారు. ఈ తేయాకు కిలో ధర రూ.30 వేలు.
మనోహరి గోల్డ్ టీ
అసోంలో ఎక్కువగా లభించే చాయ్ మనోహరి గోల్డ్ టీ. భారతదేశంలోని అరుదైన తేయాకుల్లో ఇది ఒకటి. దీనిని పూర్తిగా చేతితోనే తయారు చేయడం వల్ల నాణ్యతతో కూడి ఉంటుంది. సూర్యోదయానికి ముందే ఈ తేయాకును తయారు చేయడం వల్ల మనోహరి గోల్డ్ టీ అంటారు. దీని ధర కిలో రూ.75వేలు ఉంటుంది.