Begin typing your search above and press return to search.

వావ్‌..ఈ దేశాల‌న్నింట్లో క‌రోనా ఛాయ‌లే క‌నిపించ‌లేద‌ట‌

By:  Tupaki Desk   |   6 April 2020 9:30 PM GMT
వావ్‌..ఈ దేశాల‌న్నింట్లో క‌రోనా ఛాయ‌లే క‌నిపించ‌లేద‌ట‌
X
ఇప్పుడంతా క‌రోనా జ‌ప‌మే. ఆ వైర‌స్‌ సృష్టిస్తున్న క‌లక‌లం కార‌ణంగా దేశాల‌కు దేశాలే అల్ల‌క‌ల్లోల స్థితికి చేరిపోతున్నాయి. ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప‌కూలిపోతోంది. కొన్ని దేశాల్లో శ‌వాల‌ను కూడా పూడ్చ‌లేని దుస్థితి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి విష‌యంలో ఇంత టెన్ష‌న్ ప‌డే ప‌రిస్థితి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉంటే... కొన్ని దేశాలు మాత్రం రిలాక్స్‌గా ఉన్నాయి. అక్క‌డికి క‌రోనా వైర‌స్ గాలి కూడా సోక‌ని ప‌రిస్థితి ఉంది. కొన్ని పసిఫిక్‌ ద్వీపాల్లోని కొన్ని చిన్న దేశాల్లో, ఆసియాలో కొన్ని దేశాల్లోనూ ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా పాజిటివ్ కేసు న‌మోదు కాలేదు.

ముందుగా మన ఆసియా ఖండంలోని వాటి విష‌యానికి వ‌స్తే, ఈ మ‌హ‌మ్మారి పుట్టిన చైనాకి అత్యంత సమీపంలో ఉన్న నార్త్ కొరియాలో కరోనా వైరస్ లక్షణాలు ఒక్కటి కూడా లేవట‌. దీంతోపాటుగా యెమెన్, తుర్కెమిస్థాన్, తజికిస్థాన్‌‌లలో కరోనా లక్షణాలు ఇప్పటివరకూ కనిపించలేదని పేర్కొంటున్నారు. మ‌రోవైపు, ఆఫ్రికా ఖండం విష‌యంలో సమోవా, కిరిబతి, సొలొమాన్ ద్వీపం, వనౌటు, మైక్రోనేసియా, టోంగా, మార్షల్ ఐలాండ్స్ పాలౌ, తువాలు, నవురు దేశాలలో ఇప్పటివరకూ కోవిడ్-19కు కేసులు న‌మోదు కాలేదు.

ఆఫ్రికాలోని ఈ చిన్న దేశాల‌కు వైర‌స్‌ వ్యాప్తి చెంద‌క‌పోవ‌డానికి ఆస‌క్తిక‌ర‌మైన కార‌ణం ఉంది. అదేంటంటే... ఈదేశాల‌కు మిగ‌తా దేశాల‌ తో సంబంధాలు లేక‌పోవ‌డం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇత‌ర దేశాల‌తో అంత‌గా రాక‌పోక‌లు లేక‌పోవ‌డం వ‌ల్ల ప‌ర్యాట‌కులు రాక‌పోవ‌డంతో...ఈ దేశాలు క‌రోనా బారిన ప‌డ‌లేద‌ట‌. ఇదిలా ఉండ‌గా, ప్ర‌పంచంలో అగ్ర‌దేశం అనే పేరున్న అమెరికా క‌రోనాకు వ‌ణిక‌పోతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు అమెరికాలో నమోదు అయ్యాయి. అమెరికా తర్వాతి స్థానాల్లో స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ ఉన్నాయి.