Begin typing your search above and press return to search.

ఈ అలవాట్లు మీ శృంగార జీవితాన్ని నాశనం చేస్తాయి..

By:  Tupaki Desk   |   11 Jan 2023 4:53 AM GMT
ఈ అలవాట్లు మీ శృంగార జీవితాన్ని నాశనం చేస్తాయి..
X
దాంపత్య జీవితంలో శృంగారం కీలకం. ఇది అత్యంత సుఖంగా ఉంటేనే దంపతులిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఫలితంగా ప్రేమాభిమానాలు పెంపొంది ఒకరికొకరు గౌరవంగా బతుకుతారు. అయితే కొందరు పురుషులు తాము ఏర్పరుచుకున్న వ్యసనాలు శృంగారాన్ని నాశనం చేస్తాయి. వారికుండే కొన్నిఅలవాట్లతో శృంగారంలో అనేక సమస్యలు వస్తాయి.

భార్యభర్తల మధ్య శృంగారం సాఫీగా లేకపోతే ఇద్దరు విడిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. అందువల్ల ఆనందమైన శృంగారం కోసం కొన్నింటిని త్యాగం చేయక తప్పదు. ముఖ్యంగా పురుషులకుండే అలవాట్లను కొన్నింటిని మానుకోవడం లేదా తగ్గించుకుంటే బెటర్. మరి శృంగారానికి అడ్డుపడే ఆ అలవాట్లేంటో చూద్దాం..

మద్యపానం..

రోజంతా టెన్షన్ వాతావరణంలో గడిపిన వారు కాస్త మద్యం పుచ్చుకొని రిలాక్స్ అవుతారు. అయితే ఇది మితిమీరితే ప్రమాదమే. కొందరు మద్యం సేవించడం పనిగా పెట్టుకొని ఫుల్లుగా తాగేస్తారు. దీంతో ఇంటికెళ్లాక వెంటనే నిద్రిస్తారు. ఒకవేళ మద్యం తక్కువగా సేవించి శృంగారంలో పాల్గొన్నా భాగస్వామికి నచ్చకపోవచ్చు. ఆ దుర్వాసనతో మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా అతిగా మద్యం సేవించడం వల్ల శృంగారంపై అనాసక్తి పెరుగుతుంది. దీంతో ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనలేరు.

ధూమపానం

ధూమపానం కూడా శృంగార జీవితంలో సమస్యలు తెస్తుంది. కొందరు తమ టెన్షన్ ను తగ్గించుకోవడానికి ధూమపానం సేవిస్తున్నామని చెబుతారు. కానీ పొగాకులో ఉండే నికొటిన్ శృంగారపై ఆసక్తిని తగ్గిస్తుంది. అంతేకాకుండా ధూమపానం చేసిన తరువాత శృంగారంలో పాల్గొంటే భాగస్వామికి అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల అందమైన శృంగారంలో పాల్గొనాలనుకునేవారు ఈ అలవాటును తగ్గించుకోండి.

రాత్రిపూట ఎక్కువగా తినడం..

భోజన ప్రియుల ఆహారానికి అడ్డూ అదుపు ఉండదు. వేళపాళ లేకుండా ఇష్టమొచ్చి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాకుండా రాత్రిపూట ఎక్కువగా తినడం వల్ల తొందరగా నిద్రకు ఉపక్రమిస్తారు. దీంతో మీకోసం ఎదురుచూసే భాగస్వామి నిరాశ చెందుతారు. అంతేకాకుండా ఎక్కువగా తిని శృంగారంలో పాల్గొనడం వల్ల కడుపులో అనేక సమస్యలు వస్తాయి. అయితే సాఫ్ట్ ఫుడ్ తీసుకొని భాగస్వామితో సరదాగా ఉంటూ శృంగారంలో పాల్గొనండి..

ఫోర్న్ వీడియోస్ చూడడం..

ఈరోజుల్లో చాలా మంది ఫోర్న్ వీడియోస్ చూసి ఆనందించేవారు ఎక్కువ. అయితే భాగస్వామిని వదిలి ఫోర్న్ వీడియోస్ చూడడం వల్ల వారిపై ఆసక్తి తగ్గుతుంది. వీడియోల్లో ఉన్న విధంగా శృంగారం కావాలనుకుంటారు. కానీ రియల్ గా అది సాధ్యం కాదు. దీంతో భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి దూరమవుతారు. అలాగే ఎక్కువగా ఇవి చూడడం వల్ల మెదడులో శృంగార కోరికలు విపరీతంగా పెరిగి మైండ్ డైవర్ట్ అయ్యే ప్రమాదం ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.