Begin typing your search above and press return to search.

ఏ రకమైన ఆహారం తింటే..ఏ స్ట్రోక్ రావచ్చు!

By:  Tupaki Desk   |   24 March 2020 1:30 AM GMT
ఏ రకమైన ఆహారం తింటే..ఏ స్ట్రోక్ రావచ్చు!
X
బ్రెయిన్ స్ట్రోక్ లేక బ్రెయిన్ డెడ్ ..ఈ పదాలని సినిమాల్లోగానీ - రియల్ లైఫ్‌ లో గానీ   మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. అయితే ఎలాంటి ఆహారం తీసుకున్నవారికి దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది. అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? దీని గురించి పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం ...

మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి వ్యక్తి చనిపోవడాన్ని బ్రెయిన్  డెడ్ అని పిలుస్తారు. అయితే అందరూ అనుకున్నట్లుగా కాకుండా ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ శాకాహారం తినేవారికి ఎక్కువగా వస్తుంటాయి. ఆక్స్‌ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కొద్దిరోజుల పాటు దీనిపై సర్వే చేసి ఈ వివరాలని వెల్లడించారు. 

దాదాపుగా  రెండు దశాబ్దాలపాటు దాదాపు 50వేలమందికి  చేసిన రీసెర్చ్‌ లో కొన్ని  ఆసక్తికర విషయాలని కనుగొన్నారు. అందులో ముఖ్యమైనది..శాకాహారులకే ఎక్కువ శాతం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని కనుగొన్నారు. బ్రిటన్‌ లో అందుకే  మాంసాహారం వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారని వారు తమ అధ్యనంలో తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్ మాంసాహారులకన్నా శాకాహారులకే వచ్చే అవకాశం 20శాతం అధికమని పరిశోధకులు చెబుతున్నారు.

శాకాహారుల్లో తక్కువ కొలస్ట్రాల్ కారణంగా రక్తం వేగంగా ప్రవహించడంతో రక్తనాళాలు చిట్లిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అని , అయితే గుండెపోటు లాంటివి మాత్రం మాంసాహారులతో పోల్చితే శాకాహారులకు వచ్చే అవకాశం 20శాతం తక్కువ అని తెలిపారు. అయితే మాంసాహారులలో కూడా చేపలు తినని వారితే పోల్చితే తినే వారికి గుండెపోటు వచ్చే అవకాశం చాలా తక్కువ అని తెలిపారు. బ్రిటీష్ మెడికల్ జర్నల్‌ లో గతంలోనూ ఈ రీసెర్చ్ ఫలితాలను ప్రచురించారు. మాంసాహారం తినేవారిలో  కొవ్వు శాతం ఎక్కువగా ఉండటంతో రక్తప్రసరణ సక్రమంగా జరగక గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వీరు తమ అధ్యయనంలో వెల్లడించారు.