Begin typing your search above and press return to search.
వాళ్లకు ఇవే చివరి ఎన్నికలు
By: Tupaki Desk | 4 Nov 2020 4:30 AM GMTసిద్దిపేట జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం కట్టిన మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ లో వారి ఊళ్లూ, ఇల్లు మునిగిపోతున్నాయి. వచ్చేసారి నీరు నింపితే ఆ గ్రామాలు జలసమాధి అవుతాయి. ఇప్పుడిప్పుడే వారంతా ప్రభుత్వం కల్పించిన పునరావాస గ్రామాలకు పోతున్నారు. ఈక్రమంలోనే చివరి సారి తమ సొంతూరు తరుఫున దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటు వేశారు. ఇదే వారికి చివరి ఎన్నికలు కావడం గమనార్హం.
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం తొగుట మండలంలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల్లో ఇవే చివరి ఎన్నికలు కానున్నాయి. మండలంలోని ఏటిగడ్డ కిష్ట్రాపూర్, వేములఘాట్, పల్లెపహడ్, లక్ష్మాపూర్, రాంపూర్, బ్రాహ్మణ బంజరుపల్లి గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలున్నాయి. ఈ గ్రామాలతో పాటు శివారు గ్రామాలైన తిరుమలగిరి, మొగిలిచెరువు తండా, తుర్కబంజరుపల్లి, నగరం, లంబాడి తండాల్లో సుమారు 10 వేల మంది ఓటర్లు చివరి సారిగా దుబ్బాక ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
ఏళ్ల తరబడి వీరంతా తమ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం మల్లన్నసాగర్ రిజర్వాయర్ ముంపు ప్రాంతంలో ఈ గ్రామాలు ఉన్నందున వారందరికీ గజ్వేల్ సమీపంలో పునరావాస కాలనీలు ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాలను ఇప్పటికే తరలించగా మరో రెండు మూడు గ్రామాలను త్వరలోనే తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో దుబ్బాక ఉప ఎన్నికలు రావడంతో తరలివెళ్లిన వారు.. ఇక్కడున్న గ్రామాల వారు చివరిసారిగా తమ ఓట్లు వేశారు.
వచ్చే ఏడాది మల్లన్నసాగర్ నింపనున్నారు. ఆలోపు గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయనున్నారు. అప్పటిలోగా మరే ఎన్నికలు లేవు. దీంతో వలసవెళ్లిన ముంపు బాధితులంతా వచ్చి చివరి సారి ఓటు వేశారు. బాధితుల ఆందోళనల నేపథ్యంలో పోలీసులు దాదాపు 6 బస్సుల్లో ముంపు గ్రామాలకు చెందిన 500 మందిని అత్యంత పటిష్ట భద్రతతో తీసుకొచ్చి మరీ ఓటువేయించారు.