Begin typing your search above and press return to search.

టీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే

By:  Tupaki Desk   |   11 Oct 2020 11:25 AM IST
టీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే
X
రోటీన్ తో పోలిస్తే.. ఈసారి తెలంగాణ మంత్రి వర్గ సమావేశం కాస్త ముందుగానే ముగిసిందని చెప్పాలి. సాధారణంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించే కేబినెట్ భేటీలు కనీసం ఆరు గంటలు అంతకు మించి అన్నట్లుగా సాగటం తెలిసిందే. దీంతో పోలిస్తే.. శనివారం సాయంత్రం నిర్వహించిన భేటీ చాలా త్వరగానే ముగిసినట్లుగా చెప్పాలి. సోమవారం నిర్వహించే అసెంబ్లీ సమావేశానికి అవసరమైన అంశాలపై కేబినెట్ చర్చించి ఆమోదముద్ర వేసింది.

వివిధ అంశాలపై చర్చ జరపటమే కాదు.. నిర్ణయాలు తీసేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆస్తుల నమోదు ప్రక్రియకు గడువును మరింత పెంచారు. ఇప్పటివరకు ఉన్న గడువును ఈ నెల 20 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. త్వరలో నిర్వహించే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డివిజన్ రిజర్వేషన్లను మరో ఐదేళ్లకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. గతంలో ఏ రిజర్వేషన్లను అమలు చేశారు.. వాటినే ఈసారి పాటిస్తారు. తెలంగాణ మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయాల్ని చూస్తే..

- శనివారంతో ముగిసే ఆస్తుల నమోదును మరో పది రోజులకు పెంచుతూ నిర్ణయం

- కరోనా వేళ.. రైతు కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా గ్రామాలల్లోనే ధాన్యం సేకరణ చేసిన తరహాలోనే ఈసారి అదే పద్దతిలో ధాన్యం సేకరణ చేపట్టాలి.

- గ్రామాల్లో ధాన్యం కొనుగోలుకు 6 వేల ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు. చివరి గింజ వరకు కొనుగోలు చేపట్టాలి.

- రైతాంగం హడావుడి పడకుండా ధాన్యాన్ని తమ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలి. ధాన్యంలో తేమను 17 శాతానికి మించకూడదు. తాలు పొల్లు లేకుండా ధాన్యాన్ని తీసుకురావాలి.

- జీహెచ్‌ఎంసీ పాలకమండలిలో మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యానికి చట్టబద్ధత కల్పించారు.

- మహిళా రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రం చేసిన రాజ్యాంగ సవరణకు అనుగుణంగా జీహెచ్‌ఎంసీలో ఇప్పటికే అమలులో ఉన్న 50 శాతం మహిళల కోటాకు చట్టబద్ధత కల్పించాలి.

- ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో ప్రతి ఐదేళ్లకోసారి డివిజన్ల రిజర్వేషన్లు రొటేషన్‌ పద్ధతితో మారుతున్నాయి. ఇకమీదట రెండు పర్యాయాలకు (పదేళ్లకు) ఒకసారి డివిజన్ల రిజర్వేషన్లు మారుతాయి.

- వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చే క్రమంలో సంబంధిత అధికారి విచక్షణాధికారం దుర్వినియోగం కాకుండా చూసేందుకు కొత్త రెవెన్యూ చట్టంలో ప్రత్యేక నిబంధనలను ప్రభుత్వం పొందుపర్చింది.

- భూవినియోగ మార్పిడి కోసం ధరణి పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించడానికి నాలా చట్టానికి సవరణలు జరపాలి. ఇటీవల తీసుకొచ్చిన కొత్త రిజిస్ట్రేషన్‌ చట్టానికి స్వల్ప మార్పులతో సవరణలను జరపాలి.

- కొత్త రెవెన్యూ చట్టంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చట్టానికి స్వల్ప సవరణలు.

- హెచ్ ఎండీ టౌన్ షిప్ ల నిర్మాణాలకు రాయితీలు.. ప్రోత్సాహాకాలు ఇవ్వాలి.

- హెచ్‌ఎండీఎ పరిధిలో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ విధానంపై చర్చ

- వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్రం తీసుకునే నిర్ణయాలు గొడ్డలి పెట్టుగా మారాయి.

- కేంద్రం నిర్ణయాలతో మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించని దుస్థితి ఏర్పడింది.

- దేశంలో అవసరానికి మించి మొక్కజొన్న నిల్వలు ఉన్నాయి. మన రైతుల ప్రయోజనాలను విస్మరించి, ఇతర దేశాలనుంచి మక్కలు దిగుమతికి కేంద్రం అనుమతి ఇస్తోంది. విశ్వవిపణిలో మొక్కజొన్నల నిల్వలు ప్రజావసరాలకు మించి ఉన్నాయి. కేంద్ర నిర్ణయంతో మొక్కజొన్న సాగు విషయంలో రాష్ట్ర రైతాంగం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి.