Begin typing your search above and press return to search.

ఏ పాపం తెలియ‌ప్పుడు.. ఎందుకింత భ‌యం..? ఎంపీ అవినాష్‌కు నెటిజ‌న్ల క్వ‌శ్చ‌న్‌

By:  Tupaki Desk   |   10 March 2023 9:27 AM GMT
ఏ పాపం తెలియ‌ప్పుడు.. ఎందుకింత భ‌యం..? ఎంపీ అవినాష్‌కు నెటిజ‌న్ల క్వ‌శ్చ‌న్‌
X
"నాకు ఏ పాపం తెలియ‌దు. అంతా క‌లిసి న‌న్ను అమాయ‌కుడిని చేసి ఆడుకుంటున్నారు. ఓ వ‌ర్గం మీడియా నాపై వేలెత్తి చూపిస్తోంది. నేనే మీకు దొరికానా? నేను వైఎస్ కుటుంబ స‌భ్యుడిని కావ‌డ‌మే పాప‌మా?" ఖ‌చ్చితంగా గ‌త నెల 10 వ తారీకున క‌డ‌ప ఎంపీ, వైసీపీ నాయ‌కుడు.. ఎంపీ అవినాష్ రెడ్డి.. హైద‌రాబాద్‌లో మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు ఇవి.

అది కూడా వైఎస్ సోద‌రుడు వివేకానంద‌రెడ్డి హ‌త్య గురించే కావ‌డం గ‌మ‌నార్హం. వివేకా హ‌త్య జ‌రిగిన విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని.. తుచ్ఛ‌మైన ఎంపీ సీటు కోసం.. ఇలా ఎవ‌రైనా చేస్తారా? అని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. అయితే.. సీబీఐ మాత్రం త‌న మానాన త‌ను ప‌రిశోధ‌న చేస్తూనే ఉంది. అవినాష్‌ను విచారించింది. ఆయ‌న తండ్రి భాస్క‌ర‌రెడ్డిని కూడా విచారించింది. మ‌రోసారి ఇద్ద‌రూ రావాల‌ని ఇప్ప‌టికే స‌మ‌న్లు కూడా పంపింది.

అయితే.. మ‌రి అంత అమాయ‌కుడు అయిన‌ప్పుడు.. అస‌లు ఏ పాపం తెలియ‌ద‌ని.. త‌న‌పై మీడియా ఉద్దేశ పూర్వ‌కంగా.. కామెంట్లు రాస్తోంద‌ని చెప్పిన ఏడు నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జాప్ర‌తినిధి(ఎంపీ).. ఇప్పుడు బీరువుగా మారిపోయి.. "అయ్యా న‌న్ను అరెస్టు చేయొద్ద‌ని చెప్పండి ప్లీజ్‌" అంటూ కోర్టు మెట్లు ఎక్క‌డం ఎందుకు? పెన్సిల్ పోగొట్టుకున్న పిల్లాడిలా వారిపైనా వీరిపైనా నింద‌లు మోప‌డం ఎందుకు? అనేది నెటిజ‌న్లు సంధిస్తున్న ప్ర‌శ్న‌.

తాజాగా అవినాష్ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిష‌న్(అంటే.. త‌న వాద‌న వినాల‌ని కోర‌డం.. త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరడం) దాఖ‌లు చేసి.. సీబీఐ నుంచి త‌న‌ను ర‌క్షించాల‌ని వేడుకున్నారు. దీనినే నెటిజ‌న్లు కార్న‌ర్ చేస్తున్నారు. మీరు సుద్ద‌పూస అయిన‌ప్పుడు.. ఈ ఏడుపు ఎందుకు? అని ప్ర‌శ్నిస్తున్నారు. దారిన పోయే దాన‌య్య‌ను సీబీఐ విచారించింద‌ను అనుకుంటే స‌రిపోతుంది క‌దా! అని నిల‌దీస్తున్నారు. ఏదేమైనా.. ఉచ్చు బిగిస్తున్న స‌మ‌యంలో ఎక్క‌డలేని ఏడుపులు వ‌స్తాయ‌ని వ్యంగ్యాస్త్రాలు సైతం సంధిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.