Begin typing your search above and press return to search.

5జీ సేవలు తొలుత మొదలయ్యే 13 నగరాలు ఇవే

By:  Tupaki Desk   |   25 Aug 2022 9:30 AM GMT
5జీ సేవలు తొలుత మొదలయ్యే 13 నగరాలు ఇవే
X
5జీ కాలాన్ని దేశ ప్రజలకు పరిచయం చేయడానికి టెలికం కంపెనీలు ముమ్మరంగా పని చేస్తున్నాయి. ఈ మధ్యనే కేంద్రం 5జీ స్పెక్ట్రమ్ ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవటం.. దానికి సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. 4జీ కంటే పది రెట్లు వేగవంతమైన నెట్ వర్క్ సేవల్ని అందించే 5జీ సేవల్ని దేశ వ్యాప్తంగా తొలుత కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రారంభించనున్నారు.

5జీ సేవలు షురూ అయ్యే నేపథ్యంలో దాని టారిఫ్ విషయంలోనూ టెలికం సంస్థలు క్లారిటీ ఇచ్చేయటం.. 4జీ ధరలకే 5జీ సేవల్ని అందిస్తున్నట్లుగా చెప్పటం తెలిసిందే. దేశంలోని ప్రముఖ టెలికం కంపెనీలైన రిలయన్స్ జియో.. ఎయిర్ టెల్ కంపెనీలు ఈ నెలాఖరు లోపు టెలికం సేవల్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. మరోవైపు 5జీ సపోర్టు చేసే ఫోన్లకు గిరాకీ పెరిగింది. వినియోగదారులు సైతం 5జీ ఎక్స్ పీరియన్స్ ను తమ అనుభవంలోకి తీసుకునేందుకు తహతహలాడుతున్నారు.

ఇదిలా ఉంటే.. దేశంలో తొలిసారి 5జీ నెట్ వర్క్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నా.. పరిమితంగా మాత్రమే ఈ సేవలు మొదలు కానున్నాయి. దేశంలోని మొత్తం నగరాల్లో కేవం పదమూడింటిలోనే 5జీ సేవలు షురూ కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కేవలం హైదరాబాద్ లోనే ప్రారంభం కానున్నాయి. 5జీ సేవలు ప్రారంభమయ్యే పదమూడు ప్రాంతాల్ని చూసినప్పుడు దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాది ప్రాంతాల్లోనే ఈ సేవల్ని ఎక్కువగా అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పాలి. దక్షిణాదిన ఐదు రాష్ట్రాలు ఉంటే.. కేవలం మూడు నగరాల్లో మాత్రమే 5జీ సేవల్ని తొలుత అందుబాటులోకి తేనున్నారు.

- హైదరాబాద్‌

- అహ్మాదాబాద్‌

- బెంగళూరు

- చండీఘర్‌

- చెన్నై

- ఢిల్లీ

- గాంధీనగర్‌

- గుర్గావ్‌

- జామ్‌నగర్‌

- కోల్‌కతా

- లక్నో

- ముంబై

- పుణె