Begin typing your search above and press return to search.
వైసీపీ కొత్త ఎమ్మెల్సీలు వీళ్లే...!
By: Tupaki Desk | 3 Aug 2019 7:46 AM GMTఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు స్థానాలు అధికార పార్టీల ఖాతాలోనే పడనున్నాయి. తెలంగాణలో ఒకే ఒక ఎమ్మెల్సీ స్థానం టీఆర్ ఎస్ కైవసం చేసుకోనుంది. ఏపీలో ఎన్నికలు జరిగే మూడు స్థానాలు అధికార వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి. ఏపీలో వైసిపికి ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో విపక్ష టిడిపి కనీసం పోటీ చేసేందుకు కూడా స్కోప్ లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఎన్నికలు జరిగే మూడు సీట్లు వైసీపీ ఖాతాలో పడనున్నాయి. ప్రస్తుతం ఇజ్రాయిల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తిరిగి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేయనున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై జగన్ ఓ క్లారిటీ ఇచ్చినట్టు పార్టీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. జగన్ ఎన్నికల ప్రచారంలో పార్టీ కోసం త్యాగాలు చేసిన వారికి... తాను హామీ ఇచ్చిన వారికి ఎమ్మెల్సీ ఇస్తానని ప్రకటించారు. వాస్తవంగా చూస్తే జగన్ హామీలు ఇచ్చిన నేతల సంఖ్య 15కు పైమాటే... కానీ ఇప్పుడు మూడు సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఈ ముగ్గురు అభ్యర్థుల ఎంపిక జగన్ కు పెద్ద సవాల్ లాంటిది.
ఈ మూడు ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి మంత్రి మోపిదేవి వెంకటరమణకు ఖరారైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా రేపల్లె నుంచి పోటీ చేసి ఓడిన ఆయనకు అనూహ్యంగా జగన్ క్యాబినెట్ లో మంత్రి పదవి ఖరారైంది. మంత్రిగా ఉన్న ఆయన ఆరు నెలల్లో ఆయన శాసనసభకు లేదా మండలికి ఎంపిక కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే మోపిదేవికి తొలి ఎమ్మెల్సీ ఖరారైంది. ఇక రెండో ఎమ్మెల్సీని బాలయ్యపై పోటీ చేసిన మైనార్టీ నేత మహ్మద్ ఇక్బాల్ కు ఇస్తారని అంటున్నారు.
జగన్ ముఖ్యమంత్రి హోదాలోనే ఈ ప్రకటన చేశారు. రంజాన్ ఇఫ్తార్ విందులో ఇక్బాల్ కు ఎమ్మెల్సీ ఇస్తానని ప్రకటించారు. ఇక మూడో సీటు కోసం గట్టి పోటీయే ఉంది. ఈ సీటును రాయలసీమ నుంచి రెడ్లకు ఇవ్వాల్సి వస్తే ఎవరో ఒకరికి ఇవ్వొచ్చని తెలుస్తోంది. లేదా కమ్మ సామాజికవర్గానికి ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్ కే ఫస్ట్ ఆప్షన్ అంటున్నారు. ఆయన గత ఎన్నికల్లో జగన్ సూచన మేరకు చిలకలూరిపేట సీటు త్యాగం చేశారు.
ఎన్నికల్లో విడదల రజనీ గెలుపు కోసం పనిచేశారు. ఎన్నికల ప్రచారంలోనే ఆయనకు మంత్రి పదవిపై స్పష్టంగా హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తే తర్వాత అయినా మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది. అందుకే సామాజిక సమీకరణలతో పాటు జగన్ హామీను బట్టి చూస్తే రాజశేఖర్‌కు కూడా అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ అంచనాలు ఉన్నా మూడో సీటు విషయంలో మార్పులు కూడా ఉండే అవకాశం ఉంది.