Begin typing your search above and press return to search.

భారతీయులకు బ్రిటన్ వీసాలు ఇకపై ఈజీ!

By:  Tupaki Desk   |   7 Nov 2016 11:41 AM GMT
భారతీయులకు బ్రిటన్ వీసాలు ఇకపై ఈజీ!
X
యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలుగుతూ బ్రిటన్ ఏ ముహూర్తాన్న నిర్ణయం తీసుకుందో కానీ... అనంతరం భారత్ కు బ్రిటన్ నుంచి బాగానే కలిసివస్తున్నట్లుంది! ఇప్పటికే ఆ నిర్ణయం అనంతరం ఆ దేశాన్ని కీలక వాణిజ్య భాగస్వామిగా మార్చుకోవాలని భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే బ్రెగ్జిట్ అనంతరం తొలిసారి భారత్ కు విచ్చేసిన బ్రిటన్ ప్రధాని "థెరిస్సా మే".. భారత వ్యాపారులకు - రెగ్యులర్ గా బ్రిటన్ కు పర్యటించేవారికి సులభతరమైన వీసాలు అందిస్తామని ప్రకటించారు.

ఈ మేరకు ఇండియా-యూకే టెక్ సమిత్ లో ప్రసంగించిన థెరిస్సా... రిజిస్టర్డ్ ట్రావెలర్ స్కీమ్ ప్రవేశపెట్టే యోచనలో ఉన్నామని, దాంతో ఇకపై ఈజీగా భారతీయులు బ్రిటన్ లోకి ప్రవేశించడానికి ఆఫర్ చేస్తామని తెలిపారు. దీంతో బ్రిటన్ - భారత్ లకు మరిన్ని అవకాశాలు కల్పించాలనేదే తమ అభిప్రాయమని, వ్యాపారాలకు బ్రిటన్ ఎంతో అనువైనదని థెరిస్సా చెప్పారు. అలాగే తమ దేశంలో వ్యాపారాలు చేయడానికో, వ్యాపారాల కోసం ట్రావెల్ చేసేవారికి వీసా ప్రక్రియను సులభతరం చేస్తామని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

కాగా, సీఐఐ నిర్వహించిన ఈ సమిట్ లో ప్రధాని నరేంద్రమోడీ కూడా పాల్గొన్నారు. ఇండియాకు బ్రిటన్ ఎంతో ముఖ్యమైన స్నేహదేశమని ఈ సందర్భంగా మోడీ తెలిపారు! బ్రిటన్‌ ఇటీవల భారతీయ సమాజంతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోవడం సంతోషకరమని.. యూరప్‌ వెలుపల ద్వైపాక్షిక చర్చలకు భారత్‌ ను ఎంచుకోవడం గొప్ప విషయమని.. అందుకు బ్రిటన్‌ ప్రధానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/