Begin typing your search above and press return to search.

ఉగ్రదాడి చేసిన రాక్షసుడు ఎవరో తేలింది

By:  Tupaki Desk   |   23 March 2017 10:46 PM IST
ఉగ్రదాడి చేసిన రాక్షసుడు ఎవరో తేలింది
X
ప్రపంచ దేశాల్నిషాక్ కు గురి చేసిన లండన్ ఉగ్రదాడికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. బ్రిటన్ పార్లమెంటు మీద దాడి లక్ష్యంగా చేపట్టిన ఈ ఉగ్రదాడికి పాల్పడిన రాక్షసుడి వివరాల్ని గుర్తించారు. తాజా ఉగ్రచర్య తమదేనంటూ ఐసిస్ ప్రకటించుకున్న వేళ..ఈ ఘటన గురించిన వివరాల్ని బ్రిటన్ ప్రధాని థెరిసా మే ప్రకటించారు. ఉగ్రదాడికి పాల్పడిన వ్యక్తి బ్రిటన్ లో పుట్టిన వ్యక్తిగా తేల్చారు.

కొన్ని రోజుల క్రితం తీవ్రవాదానికి సంబంధించిన అంశాల కింద అతడ్ని అదుపులోకి తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఈ కేసు ప్రత్యేకమైనదని.. ఈ దాడికి సంబంధించి ముందస్తుగా ఎలాంటి ఆధారం కానీ.. సమాచారం కానీ అందలేదని స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తి ఇంటలిజెన్స్ పరిధిలో లేడన్నారు. బుధవారం ఉగ్రదాడి జరిగిన సమయంలో పార్లమెంటులోనే ఉన్న థెరిసాను ప్రత్యేక భద్రతా ఏర్పాట్ల మధ్య తరలించారు.ఈ రోజు ఆమె పార్లమెంటులో ప్రసంగిస్తూ.. ఉగ్రదాడి వివరాల్నివెల్లడించారు.

బ్రిటన్ ప్రజలు ఐకమత్యంతో ఉండాలని.. దేశంలో ఉన్న విలువలు ఉగ్రవాదాన్ని ఓడించగలవని పేర్కొన్నారు. ఉగ్రదాడిలో ఒక పోలీస్ తో సహా మొత్తం ఐదుగురు మరణించగా.. నలభైకి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈఉదంతానికి సంబంధించి లండన్ పోలీసులు ఇప్పటివరకూ ఏడుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఉగ్రదాడికి పాల్పడిన వ్యక్తి వ్యక్తిగత వివరాలు.. కుటుంబ వివరాల్ని ఇంకా వెల్లడించలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/