Begin typing your search above and press return to search.
కర్ణాటక సుడి తిరిగినట్లే..అరుదైన లోహం భారీగా లభ్యం..ఏం జరుగుతుంది?
By: Tupaki Desk | 18 Feb 2020 3:30 PM ISTకొన్నిసార్లు అంతే.. సుడి ఒక్కసారిగా తిరిగిపోతుంది. తాజాగా అలాంటి ఉదంతమే బయటకు వచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు.. సెల్ ఫోన్లలో వినియోగించే లిథియం బ్యాటరీలు తెలుసు కదా? ఇదంతా లిథియం ఖనిజం నుంచే తయారు చేస్తారు. రానున్న రోజుల్లో నడిచేదంతా లిథియం చుట్టూనే అన్నది నిజం. ఇలాంటివేళ.. మన దేశంలో ఈ ఖరీదైన లోహం నిల్వల్ని కనుగొన్నారు.
ఇప్పటివరకూ లిథియంను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవటమే కానీ.. మనకు మనంగా ఉత్పత్తి చేసుకున్నది లేదు. కానీ.. తాజాగా ఈ విషయంలో కాస్తంత ఊరట కలిగించే సమాచారం బయటకు వచ్చింది. తాజాగా జర్నల్ కరెంట్ సైన్స్ అనే పత్రికలో లిథియం నిల్వల్ని భారత్ లో కనుగొన్న విషయాన్ని వెల్లడించారు.
దక్షిణ కర్ణాటక జిల్లా లో వీటిని గుర్తించారు. బెంగళూరు కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న భూముల్లో లిథియం ఖనిజాన్ని గుర్తించారు. ఇప్పటి వరకూ ఉన్న అంచనాల ప్రకారం ఇక్కడ నుంచి 30,300 టన్నుల ముడి లోహం లభించే వీలుందని చెబుతున్నారు. అయితే.. ఇతర దేశాల్లోని నిల్వలతో పోలిస్తే.. ఇది తక్కువే అయినా.. ఏమీ లేనిదానితో పోలిస్తే మంచిదేనంటున్నారు.
మన దేశంలో దొరికిన లిథియం కంటే కొన్ని దేశాల్లో పుష్కలంగా ఉండటం గమనార్హం. చిలీలో 8.6 మిలియన్ టన్నులు.. ఆస్ట్రేలియాలో 2.8 మిలియన్ టన్నులు.. అర్జెంటీనాలో 1.7 మిలియన్ టన్నుల లిథియం ఉందని గుర్తించారు. మరి.. మన దగ్గర లభించిన లిథియం దేశాని వచ్చే దిగుమతుల్ని కొంతమేర తగ్గించుకునే వీలుందని చెప్పాలి. లిథియం తో భారత ఆర్థిక సుడి అంతో ఇంతో తిరుగుతుందని చెప్పక తప్పదు.