Begin typing your search above and press return to search.

ఆ ఆరోపణల్లో వాస్తవం లేదు .. సెవన్‌ వెస్ట్‌ మీడియాపై సీఏ ఫైర్ !

By:  Tupaki Desk   |   2 Dec 2020 11:43 AM IST
ఆ ఆరోపణల్లో వాస్తవం లేదు .. సెవన్‌ వెస్ట్‌ మీడియాపై సీఏ ఫైర్ !
X
ఐపీఎల్ ముగిసిన తర్వాత టీం ఇండియా దుబాయ్ నుండి ఆస్ట్రేలియా పర్యటన కోసం వెళ్లిన సంగతి తెలిసిందే. ఆసీస్ పర్యటన సుదీర్ఘంగా సాగనుంది. అయితే ,బీసీసీఐ కి భయపడి షెడ్యూల్ మార్చారని అధికారిక బ్రాడ్‌ కాస్టర్ చానెల్ 7 చేసిన ఆరోపణలను క్రికెట్ ఆస్ట్రేలియా తీవ్రంగా ఖండించింది. కరోనా ముప్పు ఉన్నప్పటికీ ప్రస్తుత సిరీస్‌ సురక్షితంగా సాగేలా కృషి చేసిన బీసీసీఐకి సీఏ కృతజ్ఞతలు తెలియజేసింది. బీసీసీఐకి భయపడి సీఏ షెడ్యూలు మార్చిందన్న ఛానెల్‌ 7 ఆరోపణలను తప్పుబట్టారు. మొదట చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ బీసీసీఐకి లబ్ధి కలిగేలా షెడ్యూల్‌ లో సీఏ మార్పులు చేసిందని, అసలు ఏం జరిగిందో తెలుసుకునే అవకాశాన్ని ఇవ్వాలని కోరుతూ ఛానెల్‌ 7 సంస్థ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది.

అసలు భారత్ ‌తో పర్యటనను డే/నైట్‌ టెస్టుతో ఆరంభించాల్సిందని, కానీ ఆ మ్యాచ్ ‌ను సీఏ డిసెంబర్‌ 17కు మార్చిందని.. వన్డే, టీ20లను ముందుగా నిర్వహిస్తోందని సెవన్‌ వెస్ట్‌ మీడియా సీఈవో వార్‌ బర్టన్‌ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఏ చీఫ్ నిక్ హాక్లీ.. ఈ ఆరోపణలు తమ ఆటను దెబ్బతీసేలా ఉన్నాయన్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్‌ సానుకూలంగా ఉంది. ఇలాంటి సమయంలో మా ఆటను దెబ్బతీసేలా సెవెన్‌ వెస్ట్‌ మీడియా మాట్లాడటం నిరాశ కలిగిస్తోంది. బ్రాడ్‌కాస్టర్ ఒప్పంద స్థితిపై మేం విశ్వాసంతోనే ఉన్నాం. ఎంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నా టీమిండియాతో ఈ సిరీస్‌ జరిగేందుకు బీసీసీఐలోని మా మిత్రులు ఎంతో మద్దతుగా నిలిచారు. తొలి రెండు వన్డేలకు రికార్డు వ్యూయర్ ‌షిప్‌ వచ్చింది. కరోనా సమయంలోనూ భారత్‌-ఆస్ట్రేలియా సిరీస్‌ కోసం పనిచేస్తున్న ఛానెల్‌ 7 సిబ్బందికి అభినందనలు అని అన్నారు.

ఇకపోతే , భారీ అంచనాల మధ్య ఆసీస్ గడ్డ పై అడుగుపెట్టిన టీం ఇండియా వరుస ఓటములతో సతమతమవుతోంది. పేలవ బౌలింగ్, చెత్త ఫీల్డింగ్, ఇంటెన్సిటీవ్ లేని బ్యాటింగ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా రెండింటిలో ఓడి 0-2తో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజార్చుకుంది. ప్రస్తుతం ఈ రోజు జరుగుతున్న మరో మ్యాచ్ లో పేలవ బ్యాటింగ్ తో కుప్పకూలిపోయింది. ఇకపోతే , డిసెంబర్ 17 నుంచి నాలుగు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభం కానుంది.