Begin typing your search above and press return to search.

నా కన్నా గొప్పవాడు లేడు...బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు !

By:  Tupaki Desk   |   18 Feb 2020 1:45 PM IST
నా కన్నా గొప్పవాడు లేడు...బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు !
X
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సన్నీడియోల్ , గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ తరపున పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. ఇక సినీ హీరో నుండి రాజకీయనాయకుడిగా మరీనా తరువాత అయన తాజాగా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసారు. "తప్పుడు వ్యక్తిని పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించారని కొందరు వ్యాఖ్యలు చేశారని, కాని ఎవరినైనా కొట్టేటప్పుడు నా కన్నా గొప్పవారు ఎవరూ లేరు’’ గురుదాస్‌పూర్ ఎంపీ అయిన సన్నీడియోల్ చెప్పుకొచ్చారు.

అసలు ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యలు అయన ఎందుకు చేసారు అంటే .. సినీహీరోను నాయకుడిగా తీసుకువచ్చిన బీజేపీదే తప్పని భోవా అసెంబ్లీ ఎమ్మెల్యే జోగిందర్ పాల్ సింగ్ వ్యాఖ్యానించారు. ‘‘సన్నీడియోల్ కు రాజకీయాలపై అవగాహన లేదు, సినిమాల్లోలాగా సన్నీ డాన్స్ చేయడానికి ఉపయోగపడుతున్నాడు. ఇతన్ని రాజకీయాల్లోకి తీసుకువచ్చిన బీజేపీదే తప్పు’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జోగిందర్ పాల్ సింగ్ ఆరోపణలు గుప్పించారు. ఈ నెల 13వతేదీన పటాన్ కోట్ రైల్వేస్టేషనులో ఎంపీ సన్నీడియోల్ కనిపించడం లేదు అంటూ పోస్టర్లు వేశారు.

ఈ నేపథ్యంలో పటాన్‌ కోట్ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన సన్నీడియోల ఎవరినైనా కొట్టేటప్పుడు నా కన్నా గొప్పవారు ఎవరూ లేరు అంటూ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసారు. అయితే , ప్రధాని మోడీ మాత్రం ..బీజేపీ నేతలు మాట్లాడేటప్పుడు వెనుకాముందు కొంచెం చూసుకొని మాట్లాడాలని పదే పదే చెప్తుంటారు. కానీ , అయన మాటలని బీజేపీ నేతలు కూడా పెడచెవిన పెట్టినట్టు మరోసారి స్పష్టమైంది. దీనిపై కొందరు బీజేపీ నేతలు కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ,గత ఏడాది పార్లమెంట్ ఎన్నికల్లో పంజాబ్ లోని గురుదాస్‌ పూర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సన్నీడియోల్ కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాఖర్ ను 82,459 ఓట్ల తేడాతో ఓడించారు.