Begin typing your search above and press return to search.

కరోనాకు భయపడొద్దు.. నేను కోలుకున్నాగా

By:  Tupaki Desk   |   16 March 2020 12:02 PM IST
కరోనాకు భయపడొద్దు.. నేను కోలుకున్నాగా
X
కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా ప్రజా జీవనం స్తంభిస్తోంది. ఆ వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా భయాందోళన చెందుతున్నారు. ఎక్కడ తమకు సోకుతుందేమోనని, ఆ వైరస్ వ్యాపిస్తే చనిపోతామని భయపడుతున్నారు. అయితే భయమేమి వద్దని.. కరోనా వైరస్ వ్యాపించినా తగ్గుతుందని.. అది కూడా సాధారణ జలుబు, దగ్గలాంటిదేనని.. కాకపోతే కొంత ఆలస్యమవుతుంది.. నేను కోలుకున్నాగా అంటూ పేర్కొంటున్నాడు. ఆయనే ఢిల్లీలో కరోనా బారిన పడి ఇప్పుడు తాజాగా డిశ్చార్జి అయిన వ్యక్తి చెప్పాడు. చికిత్స పొందిన అనంతరం తాను పూర్తిగా కోలుకున్నానని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా సూచిస్తున్నారు. కరోనా వైరస్ ఎలా వ్యాపించింది? చికిత్స ఎలా పొందాడో సవివరంగా తెలిపాడు.

"పారిశ్రామికవేత్త అయిన ఆ వ్యక్తి యూరప్ నుంచి భారత్‌కు ఫిబ్రవరి 25వ తేదీన చేరుకున్నా. జ్వరం రావడంతో ఆస్పత్రికి వెళ్లగా వైద్యుడు గొంతు ఇన్ఫెక్షన్‌తోనే జ్వరం వచ్చిందని చెప్పారు. మూడు రోజులపాటు మాత్రలు వేసుకోవడంతో ఫిబ్రవరి 28వ తేదీకి కోలుకున్నా. అయితే ఫిబ్రవరి 29వ తేదీన మళ్లీ జ్వరం వచ్చింది. వైద్యుల సూచనల మేరకు మార్చి 1వ తేదీన ఢిల్లీలోని రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేరాను. అక్కడ చేసిన పరీక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్ అని తేలిందని తెలియడంతో వెంటనే షాక్ కు గురయ్యా. అనంతరం నన్ను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. భయంతో ఉన్న నాకు వైద్యులు ధైర్యం ఇచ్చారని, కరోనా వైరస్‌ కచ్చితంగా తగ్గుతుందని.. ఆందోళన చెందవద్దని సూచించారు. ఆ వెంటనే చికిత్స మొదలుపెట్టడంతో ధైర్యంగా ఉన్నా. వైద్యులు అందించిన చికిత్సతో తాను పూర్తిగా కోలుకుని మార్చి 15వ తేదీన డిశ్చార్జి అయ్యాను. సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు మాదిరే ఈ వైరస్ అని, కాకపోతే కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది" అని బాధితుడు తెలిపారు.

పారిశ్రామికవేత్తగా ఉన్న ఆయన ప్రభుత్వ ఆస్పత్రి ఇక సఫ్దార్‌జంగ్ ఆస్పత్రిలో చేరగా.. ఆ ఆస్పత్రిలో అన్ని సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. ఒక అటాచ్ బాత్రూం ఉన్న ప్రత్యేక గది తనకు కేటాయించారని చెబుతూ ప్రైవేట్ హాస్పిటల్‌ కంటే సదుపాయాలు బాగున్నాయని తెలిపాడు. ఈ సందర్భంగా సొంత సోదరుడిలా వైద్యం అందించిన వైద్యులకు, వైరస్‌ వ్యాప్తిని నివారణకు సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే కరోనా వైరస్ సోకిన వారు వరుసగా కోలుకుంటుండడంతో కొంత ఆనందించే విషయం. గతంలో కూడా హైదరాబాద్ లో చికిత్స పొందుతూ కరోనా నుంచి ఓ యువకుడు కోలుకున్న విషయం తెలిసిందే.