Begin typing your search above and press return to search.
మోడీ ప్యాకేజీ: డైరెక్ట్ ప్రయోజనం సున్నా
By: Tupaki Desk | 14 May 2020 3:20 PM GMTప్రధాని మోడీ చాలా తెలివైన వారని మేధావులు అంటున్నారు. పేరుకు 20 లక్షల కోట్ల ప్యాకేజీ.. దీన్ని చూడగానే అబ్బో అని అందరూ ప్రశంసలు. ఐక్యరాజ్యసమితి సైతం మోడీ అంతటి వారు లేరు.. సరైన చర్యలు అంటూ కొనియాడారు. మరి మోడీ సార్ ఏం చేశారు? మొన్నటి ప్యాకేజీ-1లో 1.70 లక్షల కోట్లు.. ఇప్పుడు ప్యాకేజీ2 లో మరో ఆరు లక్షల కోట్లు ప్రకటించారు. ఇంకా ప్రకటిస్తూనే ఉన్నారు. అయితే 20 లక్షల కోట్లు మాత్రం నేరుగా విడుదల కావు.. ఇందులో ఆర్బీఐ ప్రకటించిన లక్షల కోట్లు కూడా ఉన్నాయి. అంతిమంగా ఇవి సామాన్యుడికి ఎటువంటి డైరెక్ట్ ప్రయోజనం చేకూరేవి కావు.. పేదలు, ప్రజల బ్యాంకు ఖాతాల్లో ఏం పడవు. అంతా పారిశ్రామిక వర్గాలకు.. వారి సంస్థలకు.. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు.. సామన్య, మధ్యతరగతి కార్మికులకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఇదే అరచేతిలో స్వర్గమంటే అని నిపుణులు దెప్పిపొడుస్తున్నారు.
కరోనా-లాక్ డౌన్ ఎఫెక్ట్ నేపథ్యంలో మోడీ 20 లక్షల కోట్ల ప్యాకేజీ మేడి పండు చందంగా ఉందని కొందరు పారిశ్రామికవేత్తలు, నిపుణులు విమర్శిస్తుంటే.. మరికొందరు అనుకూల వాదులు మాత్రం బాగుందంటూ కొనియాడుతున్నారు.
ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు ఊతమిచ్చేందుకు 4 ఏళ్ల కాలపరిమితితో మోడీసార్ రూ.3 లక్షల రుణాలను ప్రకటించారు. ఇది 45 లక్షల చిన్న వ్యాపారులకు ప్రయోజనమని చెబుతున్నారు. నిజానికి ఈ డబ్బులు నేరుగా వారికి ఇవ్వడం లేదు. అదీ అప్పుగానే.. తరువాత ముక్కుపిండి వసూలు చే్స్తారు. చచ్చినట్టు కట్టాల్సిందే. ఇంతదానికి మోడీ ఇచ్చింది ఏంటో మేధావుల బుర్రలకు కూడా అంతుబట్టడం లేదట..
ఇక పలు చిన్న సంస్థలు ఈ ప్యాకేజీపై పెదవి విరిచాయి. ఆర్థిక కార్యకలాపాలు ఆగి నగదు ప్రవాహం లేకుండా పోయిందని.. కార్మికులకు, సిబ్బంది వేతనాలు ఇవ్వలేదని.. ఈ టైంలో వారికి డైరెక్టుగా నగదును బ్యాంకుల్లో వేసేలా ప్యాకేజీ ఇస్తే మేలని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. తక్షణ మద్దతు లేకుండా వ్యాపారం కొనసాగించలేమని చెబుతున్నాయి.
ఇక ఉద్యోగులకు పీఎఫ్ హామీపైనా పెదవి విరుస్తున్నారు. కేవలం 100 మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలకు ఇది వర్తిస్తుందని.. అది కూడా 15 వేల లోపు వేతనం ఉన్న ఉద్యోగులు 90 శాతం ఉంటేనే మెలిక పెట్టడం వల్ల మోడీ ఇచ్చే ‘పీఎఫ్’ ఉపశమనం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
అంతిమంగా మోడీసార్ ఇచ్చే ఆర్థిక పరిపుష్టి కేవలం ఎంఎస్ఎంఈలకు మాత్రమే వరంగా మారనుందని.. ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొంటున్న కంపెనీలకు ప్రయోజనం శూన్యం అన్న వాదన వినిపిస్తోంది. డైరెక్టుగా ఉద్యోగులకు రెండు నెలల వేతనాన్ని ప్రభుత్వం చెల్లిస్తేనే పరిశ్రమలు, కంపెనీలు , చిన్న తరహా పరిశ్రమలు కోలుకుంటాయని అన్ని వర్గాలు కోరుతున్నాయి. కానీ మోడీ సార్ మాత్రం అలా చేయడం లేదని పెదవి విరుస్తున్నాయి.