Begin typing your search above and press return to search.

మూడు రాజ‌ధానుల‌పై 'బిల్లు' ఉన్న‌ట్టా... లేన‌ట్టా..?

By:  Tupaki Desk   |   17 Sep 2022 5:30 AM GMT
మూడు రాజ‌ధానుల‌పై బిల్లు  ఉన్న‌ట్టా...  లేన‌ట్టా..?
X
అవును.. స‌ర్వ‌త్రా ఇదే చ‌ర్చ . ఏపీ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల‌కు.. ఇలా నోటిఫికేషన్ ఇచ్చారో లేదో.. ఆ వెంట‌నే.. పెద్ద ఎత్తున మూడు రాజ‌ధానుల బిల్లు కోస‌మే స‌భ‌ను నిర్వ‌హిస్తున్నారంటూ.. అధికారిక లీకులు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇదే విష‌యం.. ప్ర‌ధానంగా జ‌నాల్లోనూ చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఒక‌వైపు రైతులు ఉద్య‌మం చేస్తుండ‌డం.. పాద‌యాత్ర‌గా అర‌స‌వ‌ల్లికివెళ్తున్న క్ర‌మంలో ప్ర‌భుత్వం.. మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా మ‌రోసారి ప‌క‌డ్బందీగా బిల్లు తెస్తుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది.

ఇక‌, అధికార పార్టీ ప‌త్రిక‌, మీడియా కూడా.. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించాయి. వికేంద్రీక‌రణ బిల్లులు ఖా యమ‌ని ప్ర‌చారం చేశాయి. అయితే.. రెండు రోజులు గ‌డిచినా.. అసెంబ్లీలో ఆ ప్ర‌స్తావ‌న ఎక్క‌డా క‌నిపించ లేదు. రాజ‌ధానిపైనా..అక్క‌డి భూముల పైనా.. చంద్ర‌బాబు , ఆయ‌న పార్టీ నేత‌లు కొనుగోలు చేసిన భూ ముల పైనా.. చ‌ర్చ అయితే.. న‌డించింది కానీ.. ఎక్క‌డా కూడా బిల్లు ప్ర‌స్తావ‌న రాలేదు. మ‌రి దీనిని బ‌ట్టి.. అస‌లు బిల్లు ఉంటుందా? లేదా..? జ‌గ‌న్ ఏమైనా వ్యూహం మార్చుకున్నారా? అనే చ‌ర్చ సాగుతోంది.

ప్ర‌స్తుతం .. జ‌గ‌న్ ముందు ఒకే ఒక ఆప్ష‌న్ ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఆయ‌న బిల్లు తీసుకువ‌చ్చే అవ‌కాశం లేద‌ని.. కోర్టు తీర్పులు.. రాజ‌ధాని రైతుల ప‌ట్ల ఉన్న సింప‌తీ.. వం టివి ఆయ‌న ఏం చేసినా..

ఇబ్బంది ప‌డ‌క‌త‌ప్ప‌ద‌ని మేధావులు చెబుతున్నారు. అంటే.. ఇప్ప‌టికిప్పుడు మ‌ళ్లీ బిల్లులు తెస్తే.. మ‌రోసారి వాటిపై రైతులు కోర్టుకు వెళ్లే అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అదేస‌మ‌యంలో కోర్టు కూడా త‌ప్పుబ‌ట్టి.. సంచ‌ల‌న తీర్పులు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని.. భావిస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఇప్పుడు.. ఎన్నిక‌ల‌కు కేవ‌లం ఏడాదిన్న‌ర స‌మ‌య‌మే ఉన్న నేప‌థ్యంలో పూర్తిగా సంక్షేమం పైనే ప్ర‌ధానంగా జ‌గ‌న్ దృష్టిపెడ‌తారు. ఇక‌, ఈ లోగా.. ఆయ‌న విశాఖ వెళ్లిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అక్క‌డికి వెళ్లిపోయి.. ఆయ‌న పాల‌న‌ను మొత్తాన్ని కూడా .. అక్క‌డి నుంచే అన‌ధికారికంగా.. నిర్వ‌హిస్తారు. ఇక‌, సీఎం ఎక్క‌డ ఉంటే.. అదే రాజ‌ధాని కాబ‌ట్టి.. అన‌ధికార రాజ‌థానిగా.. విశాఖ అయిపోతుంది.

అంతేకాదు.. ఇక్క‌డ నుంచి మూడు జిల్లాల్లోనూ రాజ‌ధాని సెంటిమెంటును పెంచిపోషిస్తారు. ఎన్నిక‌ల స‌మయానికి.. దీనినిప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తారు. ఫ‌లితంగా.. ఉభ‌య కుశ‌లోప‌రిగా.. అప్పుడు అజెండాలో చేర్చి.. త‌ర్వాత నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.