Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో అమ్ముడు పోని ప్లాట్లున్నాయి..మీరు కొంటారా?
By: Tupaki Desk | 24 Jan 2020 9:35 AM ISTగత కొద్ది కాలంగా హైదరాబాద్ లో గృహ, వాణిజ్య సంబంధమైన నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. నగరం నలు దిశళా అభివృద్ధి చెందుతుండటం, పెద్ద ఎత్తున పెట్టుబడుల రాక, ప్రైవేట్ రంగంలో విస్తృతంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల తో ఫ్లాట్లు కొనేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే, ఇటీవల ఇంకో ప్రచారం కూడా జరిగింది. హైదరాబాద్‌లో అమ్ముడుని కాని ఫ్లాట్లు ఎక్కువగా ఉన్నాయని కొన్ని సర్వే సంస్థలు ప్రకటించాయి. అయితే, ఇందులో నిజా నిజాలపై గృహ నిర్మాణ సంస్థల కూటమి అయిన క్రెడాయ్ స్పందించింది.
హైదరాబాద్ లో అమ్ముడుని కాని ఫ్లాట్లు ఎక్కువగా ఉన్నాయని కొన్ని సర్వే సంస్థలు చేస్తున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు రామకృష్ణారావు స్పష్టం చేశారు. ఆర్థిక మాంద్యం నుంచి పాఠాలు నేర్చుకున్న నిర్మాణ సంస్థలు గిరాకీని బట్టి కొత్త నిర్మాణాలు చేపడుతున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో అమ్ముడు కాని ఫ్లాట్ల ను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చని, మహా అయితే ఓ వెయ్యి దాకా ఉంటాయని స్పష్టం చేశారు. సుస్థిరమైన ప్రోత్సాహాకర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాల్ని తీసుకోవడం వల్లే భారతదేశం లోని పెట్టుబడి దారుల చూపు హైదరాబాద్ మీద కేంద్రీకృతమైందన్నారు. ప్రభుత్వం రూపొందించిన కొత్త మున్సిపల్ చట్టం వల్ల నిర్మాణ రంగానికెంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2 దాకా ప్రాపర్టీ షోను నిర్వహిస్తామన్నారు.
గత ఐదేళ్ల నుంచి హైదరాబాద్ నిర్మాణ రంగం సరికొత్త రూపును సంతరించుకుంటుందని క్రెడాయ్ ప్రధాన కార్యదర్శి వీ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. రెరా రాకతో అన్ని రకాల అనుమతులు ఉండి, నాణ్యమైన ప్రాజెక్టుల్ని నిర్మించే డెవలపర్ల సంఖ్య పెరుగుతున్నారన్నారు. అమరావతి లో ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా ఇక్కడి రియల్ రంగం అభివృద్ధి చెందుతుందనేది అపోహ అని కొట్టిపారేశారు. సుస్థిర పాలన, సానుకూల వాతావరణం, సమర్థవంతమైన పోలిసు వ్యవస్థ, పెట్టుబడుల్ని ప్రోత్సహించే ప్రభుత్వం ఉన్నప్పుడే పెట్టుబడులు పెట్టడానికి అనేక సంస్థలు ముందుకొస్తాయని వివరించారు.