Begin typing your search above and press return to search.
ఏపీ పైనే కేంద్రానికి ఇంత దూకుడు.. రీజనేంటి?
By: Tupaki Desk | 7 Sept 2021 1:33 PM ISTఇటీవల జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో కేంద్రం అనుసరిస్తు న్న వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా.. తెలంగాణ కంటే..ఏపీ విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు దూకుడు ఎక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వ రంగంలోకి కంపెనీలను ఒక్కొక్కటిగా అమ్మకానికి పెడుతున్న వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మొండిగా ముందుకు వెళ్తుండగా.. ఇప్పుడు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం, రాజమండ్రి విమానాశ్రయాలను కూడా అమ్మకానికి పెడుతున్నట్టు స్పష్టమవుతోంది.
మరోవైపు.. గంగవరం పోర్టులో ఏపీకి ఉన్న 10 శాతం వాటాను కూడా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అదానీకి అమ్మేయడం వెనుక.. కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని గుసగుసుల వినిపిస్తున్నాయి. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ సొంత జిల్లా గుజరాత్‌కు చెందిన అమూల్ పాల సంస్థను దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే రుద్దడం.. కూడా చర్చకు దారితీసింది. ఇక, ఇవే పరిణామాలను తెలంగాణలో తీసుకుం టే.. కేంద్రం దూకుడుకు అక్కడి టీఆర్ ఎస్ ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తోంది. వరంగల్‌లో ఏర్పాటు చేయా ల్సిన పసుపు బోర్డును తమిళనాడుకు తరలించడంపై టీఆర్ ఎస్ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు.
దీంతో కేంద్రం ఈ నిర్ణయంపై సమీక్షిస్తామని చెప్పింది. అదేసమయంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల విక్రయ ప్రతిపాదనలను కూడా విరమించుకుంది. నిజానికి పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక ల్లోనూ ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయి. వాటి జోలికి వెళ్లకుండా.. వెళ్లినా.. కొద్ది పాటి వాటాను మాత్ర మే విక్రయిస్తున్న మోడీ సర్కారు ఏపీ విషయానికి వస్తే.. మాత్రం పూర్తిగా ఇక్కడి పరిశ్రమలను అమ్మేసేందుకు రెడీ కావడం.. చర్చకు దారితీస్తోంది. దీనికి రాజకీయ కారణాలే ఉన్నాయా? లేక.. ఇంకేమైనా రీజన్లు ఉన్నాయా? అనేది చర్చకు దారితీస్తోంది.
ఒకటి రాజకీయ కారణం కాగా.. రెండు బీజేపీ వ్యక్తిగత కారణం కూడా కనిపిస్తోంది. రాజకీయంగా ఏపీలో బీజేపీని ఎదరించి.. నిలిచే పార్టీలు కనిపించడం లేదు. వైసీపీ, టీడీపీల పరిస్థితి ఒకే విధంగా కనిపిస్తోంది. రాజకీయంగా ఈ రెండు పార్టీలు..కేవలం రాష్ట్రంలో మాత్రమే పోరాడుకుంటున్నాయి తప్ప.. కేంద్రం విషయానికి వస్తే.. ఒకపార్టీకి తెలియకుండా.. మరోపార్టీ మోడీకి మద్దతు ప్రకటిస్తున్నాయి. దీంతో ఏపీలో అడిగే వారు లేరనేది స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక, మరో రీజన్.. ఏపీలో బీజేపీ బలపడేది లేదు. సో.. ఈ విషయాన్ని గ్రహించిన బీజేపీ.. ఏం చేసినా.. మనకు పోయేది ఏముంటుంది? అనే ధోరణిలో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. తెలంగాణ విషయంలో అంతో ఇంతో అధికారంపై ఆశలు ఉన్నాయి. దీంతో అక్కడ ఆచితూచి వ్యవహరిస్తున్న మోడీ .. ఏపీ విషయానికి వస్తే.. మాత్రం దూకుడుగా వెళ్తుండడం గమనార్హం. మొత్తంగా చూస్తే..ఈ పరిణామం.. రాబోయే రోజుల్లో ఏపీని మరింత ఇబ్బందుల పాల్జేస్తుందని అంటున్నారు పరిశీలకులు.