Begin typing your search above and press return to search.
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిలో ఊహించని టాలెంట్లు ఎన్నో
By: Tupaki Desk | 20 Dec 2020 6:45 AM GMTఇటీవల దేశ వ్యాప్తంగా పలువురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు బదిలీ కావటం తెలిసిందే. ఆ క్రమంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి నియమితులయ్యారు. ఆయనకు సంబంధించిన కొన్ని అంశాలు బయటకు వచ్చినా.. చాలా విషయాలు చర్చకు రాలేదు. అయితే.. ఆయనలోని కొన్ని టాలెంట్లు ఆసక్తికరంగానే కాదు.. ఆయన్ను అరుదైన వ్యక్తి అన్న భావన కలిగించేలా చేస్తాయని చెప్పక తప్పదు.
ఏపీకి రావటానికి ముందు ఆయన సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆయన న్యాయకోవిదుడే కాదు.. మంచి క్రికెటర్ అన్న విషయం చాలామందికి తెలీదు. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం పెద్దగా ప్రాచుర్యంలో లేని నేపథ్యంలో అరూప్ కుమార్ గోస్వామి వివరాలు పెద్దగా తెలీవనే చెప్పాలి.
మంచి క్రికెటర్ అయిన ఆయన.. రంజీట్రోఫీలో అసోం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన టాలెంట్ ఆయన సొంతం. అంతేకాదు.. గువాహటి హైకోర్టు ద్వైవార్షిక బులెటిన్ కు ఎడిటర్ గా వ్యవహరించారు. ఇలా బహుముఖ టాలెంట్లు ఉన్న ఆయనలోని క్రికెటర్ విషయానికి వస్తే..సీనియర్ స్థాయిలో తూర్పు మండలానికి అండర్ 19, అండర్ 22 జట్ల తరఫున రంజీట్రోఫీల్లో ఆడారు.
1985లో న్యాయవాద పట్టా పొందిన కొన్నేళ్ల తర్వాత హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2019లో సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ చేయటానికి ముందు కొంతకాలం పాటు.. గువహటి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన రికార్డు ఆయన సొంతం. ఆయన కెరీర్ లో అత్యధిక భాగంగా ఈశాన్య భారతంలోనే ఎక్కువ సేవలు అందించారని చెప్పాలి.