Begin typing your search above and press return to search.

92 లక్షలు దాటిన కేసుల సంఖ్య .. తగ్గని కరోనా జోరు !

By:  Tupaki Desk   |   25 Nov 2020 12:10 PM GMT
92 లక్షలు దాటిన కేసుల సంఖ్య .. తగ్గని కరోనా జోరు !
X
భారత్ లో కరోనా మహమ్మారి జోరు కొంచెం తగ్గినట్టే కనిపిస్తున్నా కూడా ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఓ తప్పు మూల్యం .. ప్రాణం. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే , అంత మంచిది. వ్యాక్సిన్ వచ్చే వరకూ జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఇకపోతే గత 24 గంటల్లో దేశంల 44,376 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 92,22,216కి చేరింది. నిన్న 481 మంది కరోనా మహమ్మారితో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,34,699కి చేరింది. ప్రస్తుతం ఇండియాలో మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో అది 2.3 శాతంగా ఉంది.

ఇండియాలో నిన్న 37,816 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 86,42,771కి చేరింది. రికవరీ రేటు 93.7 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 4,44,746 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న ఇండియాలో... 11,59,032 టెస్టులు జరిగాయి. మొన్నటి కంటే అవి 59,487 ఎక్కువ. మొత్తం టెస్టుల సంఖ్య 13కోట్ల 48 లక్షల 41వేల 307కి చేరింది. ఇండియాలో యాక్టివ్ కేసులు 6వేలు పెరిగాయి. దేశంలోనే ఎక్కువగా ఢిల్లీలో కొత్త కేసులు ఏకంగా 6.2వేలు వచ్చాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 5.43వేలు వచ్చాయి. కేరళలో 5.42వేలు నమోదయ్యాయి.

ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్‌లో కొనసాగుతోంది. ఇండియా, బ్రెజిల్, ఫ్రాన్స్, రష్యా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా తర్వాత ఇండియా, బ్రెజిల్, రష్యా, ఇటలీ ఉన్నాయి. మొత్తం మరణాల్లో అమెరికా టాప్‌లో ఉండగా... బ్రెజిల్, ఇండియా, మెక్సికో, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రోజువారీ మరణాల్లో అమెరికా టాప్‌లో ఉండగా..., బ్రెజిల్, బ్రటన్, ఫ్రాన్స్ తర్వాతి పొజిషన్లలో ఉన్నాయి.