Begin typing your search above and press return to search.
అప్పుడు 'గో కరోనా గో...' ఇప్పుడు నో కరోనా నో'
By: Tupaki Desk | 28 Dec 2020 7:00 AM GMTదేశంలో కరోనా మహమ్మారి జోరు కొనసాగుతుంది. ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా కూడా కరోనా కంట్రోల్ లోకి రావడం లేదు. వైద్యులు, సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ఇలా చాలామంది పోరాటం చేస్తున్నారు. వారికి సంఘీభావంగా రాజకీయ నాయకులు, పలు వర్గాల వారు, ప్రజలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే కరోనా నియంత్రణ, అవగాహన కోసం కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇచ్చిన ఓ నినాదం ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన ‘గో కరోనా గో కరోనా’ అని అన్నారు.
కాగా కొత్తగా రూపు మార్చుకున్న కరోనా స్ట్రెయిన్ రూపంలో దూసుకొస్తోంది. కొద్ది వారాలుగా ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో అథవాలే కొత్త నినాదంతో ముందుకు వచ్చారు. కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ కోసం ‘నో కరోనా.. నో కరోనా’ అనే స్లోగన్ ఇస్తున్నానని అన్నారు. కాగా,గత అక్టోబర్ నెలలో కరోనా వైరస్ బారినపడ్డ రాందాస్ అథవాలే ముంబై ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 10 రోజులకు ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద గో కరోనా గో అంటూ ఆయన ఇచ్చిన స్లోగన్ చాలా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో ఈ స్లోగన్‌పై విపరీతమైన ట్రోలింగ్స్ కూడా వచ్చాయి. అథవాలే ఇచ్చిన తాజా స్లోగన్ పై ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి.