Begin typing your search above and press return to search.

వీడియోలు చూసి చోరీలు.. ఛేదించిన పోలీసులు

By:  Tupaki Desk   |   18 Jan 2021 5:00 AM IST
వీడియోలు చూసి చోరీలు.. ఛేదించిన పోలీసులు
X
యూట్యూబ్ లో వీడియోలు, క్రైం వార్తలు నుంచి స్ఫూర్తి పొందిన ఓ యువకుడు దొంగతనాలకు స్కెచ్ గీశాడు. అమలు చేశారు. సక్సెస్ అయ్యింది. దీంతో ఇక అదే పంథాను అలవరుచుకొని రెచ్చిపోతున్నాడు.

ఇళ్లలో దొంగతనాలు, బైక్ చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను తాజాగా హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని ఆరాతీయగా వారి దొంగతనాల టెక్నిక్ బయటపడింది.

జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాలను ఈ దొంగల ముఠా టార్గెట్ చేస్తోందని తేలింది. వీడియోలు, క్రైం వార్తలతో స్ఫూర్తి పొంది ఇలా చాకచక్యంగా దొంగతనాలు చేస్తూ తప్పించుకుంటున్నారు.

ఈ ముఠా సభ్యుల్లో ఆరుగురిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వీరి నుంచి పోలీసులు 26 ఇళ్ల చోరీ కేసుల్లో రూ.30లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 23 బైకులు స్వాధీనం చేసుకున్నారు.

హైటెక్ ఆన్ లైన్ వీడియోలతో అత్యంత చాకచక్యంగా దొంగతనాలు చేస్తున్న వీరి చరిత్ర చూసి పోలీసులే ఆశ్చర్యపోయిన పరిస్థితి నెలకొంది.