Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఇంటి వెనుకే దోచేశారా?

By:  Tupaki Desk   |   8 Feb 2016 11:42 AM IST
చంద్రబాబు ఇంటి వెనుకే దోచేశారా?
X
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం అంటే ఎంత భద్రత ఉంటుంది? అందులోకి చంద్రబాబు నాయుడు లాంటి టెక్నాలజీ అప్ డేటెడ్ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర అధునాతన భద్రతా ఏర్పాట్లు చేయటం మామూలే. అలాంటి సీఎం ఇంటి దగ్గరే ఖరీదైన లైట్లు చోరీకి గురి కావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అడుగుకో భద్రతా సిబ్బంది ఉండి కూడా ఏం చేస్తున్నట్లు? అన్న సందేహం కలగక మానదు. కృష్ణా తీరంలో చంద్రబాబు నివాసం దగ్గర భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. పోలీసుల పహరాతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంటుంది.

అలాంటి ఇంటికి వెనుక భాగంలో 5000 వాట్ల సామర్థ్యం ఉన్న ఖరీదైన లైట్లను దొంగలు చోరీ చేయటం సంచలనంగా మారింది. ఈ చోరీ విషయం బయటకు కానీ పొక్కితే పరువు పోతుందన్న ఉద్దేశంతో అధికారులు కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా దొంగిలించిన లైట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని పంచాయితీని అధికారులు ఆదేశించటం.. అయితే సదరు పంచాయితీ దగ్గర డబ్బులు లేకపోవటంతో అద్దెకు లైట్లు పెట్టి బండి నడిపిస్తున్నారు.

ఇంత చేస్తే.. అద్దెకు తెచ్చిన లైట్లకు అద్దెను సకాలంలో చెల్లించకపోవటం సదరు యజమాని వచ్చి లైట్లను తీసుకెళ్లిపోవటంతో ఈ వ్యవహారం కాస్తా బయటకు వచ్చింది. ఇలాంటి విషయాలు ఎంత పరువు తక్కువ? ఏపీ అధికారులకు ఇలాంటివేమీ పట్టవా?