Begin typing your search above and press return to search.

టీ సీఎం ఛాంబ‌ర్ ద‌గ్గ‌రే దొంగ‌లు ప‌డ్డారే

By:  Tupaki Desk   |   19 Oct 2015 9:12 AM GMT
టీ సీఎం ఛాంబ‌ర్ ద‌గ్గ‌రే దొంగ‌లు ప‌డ్డారే
X
తెలంగాణ రాష్ట్ర ప‌రిపాల‌న‌కు గుండెకాయ లాంటిది స‌చివాల‌యం. స‌ద‌రు స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి ఛాంబ‌ర్‌ కు ద‌గ్గ‌ర్లో ఉండే ఛాంబ‌ర్ లో జ‌రిగిన దొంగ‌త‌నం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఎక్క‌డో దొంగ‌లు ప‌డ‌టం వేరు.. తెలంగాణ రాష్ట్ర స‌చివాల‌యంలోనే దొంగ‌లు ప‌డ‌టం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

సీఎం ఛాంబ‌ర్ కు ప‌క్క‌నే ఉండే డీ బ్లాక్ లో చోరీ జ‌రిగిన‌ట్లు చెబుతున్నారు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు వ‌చ్చి జ‌న‌రేట‌ర్ బ్యాట‌రీని త‌మ‌తో తీసుకెళ్లార‌ని తేల్చారు. అత్యంత క‌ట్ట‌దిట్ట‌మైన భ‌ద్ర‌త ఉండే స‌చివాల‌యంలోకి వెళ్లే సాహ‌సం ఎవ‌రు చేస్తార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగామారింది. స‌చివాల‌యంలో దొంగ‌లు ప‌డిన ఘ‌ట‌న అధికారుల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తేలా చేస్తోంది.

స‌చివాల‌యం లాంటి ప్రాంతంలోకి వ‌చ్చిన దొంగ‌త‌నం చేసే సాహ‌సం ఎవ‌రూ చేయ‌రని.. ఇది క‌చ్ఛితంగా ఇంటి దొంగ‌ల ప‌నిగా అంచ‌నా వేస్తున్నారు. సీసీ కెమేరాల ఫుటేజ్ ని పరిశీలించి.. దొంగ‌ల్ని వెంట‌నే అదుపులోకి తీసుకుంటామ‌ని చెబుతున్నారు. దొంగ‌ల్ని ఎప్పుడు ప‌ట్టుకుంటార‌న్న‌ది త‌ర్వాత విష‌యం. కానీ..ఏకంగా తెలంగాణ రాష్ట్ర స‌ర్కారును న‌డిపించే స‌చివాల‌యంలో చోరీ చోటు చేసుకోవ‌టం స‌ర్కారుకు ఇబ్బందిక‌ర అంశంగా చెప్ప‌క త‌ప్ప‌దు.