Begin typing your search above and press return to search.
పోలవరం మెగా ఆఫీసులో చోరీ, ఇంటిదొంగలేనా?
By: Tupaki Desk | 7 Aug 2020 9:30 AM ISTపోలవరం కాంట్రాక్టు దక్కించుకున్న మెగా ఇంజినీరింగ్ కంపెనీ (మెయిల్) పనులు వేగంగా నిర్వహిస్తోంది. వీటి పర్యవేక్షణ, నిర్వహణ అధికారుల కోసం అక్కడ ఒక ప్రత్యేక ఆఫీసు కూడా ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ ఆఫీసులో ఒక పెద్ద చోరీ జరిగినట్టు సమాచారం తెలుస్తోంది.
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్ట్ దగ్గరున్న ఈ ఆఫీసు నుంచి రూ.50 లక్షల నగదు చోరీకి గురైంది. ప్రాజెక్టు పనుల్లో కూలీలు సొమ్ము, ఉద్యోగుల జీతాల కోసం ఎపుడూ కొన్ని నగదు నిల్వలు ఆఫీసులో ఉంటాయి. ఇది సాధారణం. కానీ ఇలాంటి చోరీ ఎపుడు జరగలేదు. సాధారణ వ్యక్తులు ఇటువైపు వచ్చే అవకాశం కూడా తక్కువే. ఎందుకంటే అది కేవలం పోలవరం ప్రత్యేక ఆఫీసు. దీన్ని బట్టి అక్కడి వ్యవహారం అంతా తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు.
నిరంతరం భద్రత ఉండే ఆ ఆఫీసు నుంచి డబ్బు మాయం కావడం అంటే... అది సెక్యూరిటీకి తెలియకుండా జరిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో వారి చేయి ఉంటుందని సిబ్బంది అనుమానిస్తున్నారు. కంపెనీ ప్రతినిధులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.