Begin typing your search above and press return to search.
సోదరుడి రూంలో ఆ రాత్రి ఏం జరిగింది?
By: Tupaki Desk | 11 March 2021 8:00 PM ISTహైదరాబాద్ లో మరో దారుణం వెలుగుచూసింది. సోదరుడు అని నమ్మి వెళ్లిన యువతిని నట్టేట ముంచాడు. ఓ యువకుడు తన సోదరిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మానవ సంబంధాలకు మాయని మచ్చగా మిగిలింది.
అత్యాచారం చేసిన యువకుడు వీడియో తీసి ఆమెకు వాట్సాప్ లో పంపాడు. ఆమెకు బలవంతంగా మద్యం తాగించి మరీ అతడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు నిలదీయడంతో ఈ విషయం వెలుగుచూసింది.
కర్ణాటకకు చెందిన దంపతులు తన ముగ్గురు కుమార్తెలతో కలిసి హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు.వారి రెండో అమ్మాయి ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. ఆ యువతి పిన్ని కుమారులు ఇద్దరు ఫిలింనగర్ లో ఉంటున్నారు. వీరు అప్పుడప్పుడూ ఇళ్లకు వస్తూ పోతూ ఉంటారు. వరుసకు సోదరులు కావడంతో ఈ యువతి వారితో సన్నిహితంగానే మెలిగేది.
ఆ ఇద్దరు సోదరుల్లో ఒకరు మార్చి 1న ఆ యువతి వద్ద రూ.50వేలు అప్పు చేశాడు. మార్చి 2న వారి రూముకు వెళ్లిన యువతికి సోదరుడు బలవంతంగా మద్యం తాగించాడు. మద్యం మత్తులో యువతి నిద్రపోయింది. ఆ తర్వాత మెళకువ వచ్చి ఇంటికి వెళ్లిపోయింది.
మార్చి 4న డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ సోదరుడికి ఫోన్ చేసింది. అయితే ఫోన్ కాల్ కట్ చేసిన తర్వాత వెంటనే ఆమెకు ఆ యువకుడు ఓ వాట్సాప్ ఫొటోను పంపాడు. దాన్ని చూసిన ఆమె భయంతో సోదరుడికి ఫోన్ చేసింది. ‘మద్యం మత్తులో పడుకున్న నీపై అత్యాచారం చేశాను. డబ్బులు అడగొద్దు.. నేను అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ ఉండు’ అంటూ బెదిరించాడు. లేకపోతే ఇంటర్నెట్ లో పెడుతానని హెచ్చరించాడు.
కొద్దిరోజులుగా యువతి తీవ్ర ఆందోళనతో కనిపించడంతో తల్లిదండ్రులు నిలదీస్తే అసలు విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.