Begin typing your search above and press return to search.

శృంగారం శ్రుతిమించి మంచం పైనే ప్రాణాలు కోల్పోయిన యువతి !

By:  Tupaki Desk   |   3 Sept 2020 5:00 AM IST
శృంగారం శ్రుతిమించి మంచం పైనే  ప్రాణాలు కోల్పోయిన యువతి !
X
జీవితంలో ప్రతి పనికి కూడా ఓ హద్దు అనేది ఉంటుంది. ఏ పని ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి .. చేస్తున్నాం కదా అని శృతిమించి చేస్తే మొదటికే మోసం జరగొచ్చు. అందుకే మన పెద్దలు ‘అతి సర్వత్ర వర్జయేత్’ అని చెప్తారు. ఈ సూత్రం శృంగారానికి కూడా వర్తిస్తుంది. సరసం శ్రుతిమించితే ప్రాణాలు కూడా కోల్పోయే ఆస్కారం ఉంది. ఓ యువతి ఇలాగే ప్రియుడితో హోటల్ గదిలో అతిగా సెక్స్‌ చేస్తూ ప్రాణాలొదిలింది. ఈ సంఘటన కేరళలోని కొచ్చిన్ నగరంలో చోటుచేసుకుంది.

కేరళలోని అలప్పుఝా ప్రాంతానికి చెందిన ఓ యువతి చదువు పూర్తిచేసుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. ఇంటర్వ్యూ నిమిత్తం ఈ నెల 12వ తేదీ కొచ్చిన్‌ కు వెళ్లింది. అక్కడ తన సోషల్ ‌మీడియా ఫ్రెండ్ అయిన గోకుల్ అనే యువకుడిని కలిసింది. ఆ రోజు అక్కడే ఉండాల్సి రావడంతో ఇద్దరూ కలిసి ఓ హోటల్‌ లో గది తీసుకున్నారు. కాసేపటి తర్వాత గోకుల్ ఆమెను సెక్స్‌ కోసం ప్రేరేపించగా ఆమె అంగీకరించింది. ఇద్దరూ అన్నీ మరిచి శృంగారం లోకంలో మునిగితేలారు. కాసేపటి తర్వాత గదిలో నుంచి యువతి పెద్దగా కేకలు వేయడం ప్రారంభించింది. ఆ వెంటనే గోకుల్ అర్ధనగ్నంగా బయటకు పరుగులు తీశాడు. దీంతో సిబ్బంది ఏం జరిగిందోనన్న ఆందోళనతో గదిలోకి వెళ్లి చూడగా యువతి అపస్మారక స్థితిలో పడి ఉంది. దీనితో, ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. అతిగా సెక్స్ చేయడం వల్లే ఆమె జననాంగాల వద్ద రక్తస్రావం జరిగి మరణించిందని పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడి కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న గోకుల్‌ ను అరెస్ట్ చేసి రిమాండ్ ‌కు తరలించారు.