Begin typing your search above and press return to search.

కరోనా లక్షణాలతో వచ్చిన యువతినీ వదల్లేదు..మర్దన పేరుతో ఆస్పత్రి ఉద్యోగి దారుణం

By:  Tupaki Desk   |   14 Sept 2020 6:00 AM IST
కరోనా లక్షణాలతో  వచ్చిన యువతినీ వదల్లేదు..మర్దన పేరుతో ఆస్పత్రి ఉద్యోగి దారుణం
X
మృగాళ్లు చెలరేగిపోతున్నారు. వావీ వరుసలు పట్టడంలేదు. చివరికి తల్లీబిడ్డలపై కూడా తెగబడుతున్నారు. ఎదుటి వాళ్లు ఎంత కష్టంలో ఉన్నా వాళ్లకు పని లేదు. వాళ్లకు ఆ 'పనే' ముఖ్యం. చివరికి కరోనాతో బాధ పడుతున్నా వదలడం లేదు. ఇటీవల కరోనాతో బాధ పడుతున్న ఓ యువతిని 108 డ్రైవర్ అత్యాచారానికి ఒడిగట్టిన సంగతి మరచిపోక ముందే తాజాగా హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. కరోనా లక్షణాలతో వెళ్లిన ఓ యువతి పై ఆస్పత్రి ఉద్యోగి కన్నేశాడు. జండూ బామ్ తో మర్దన చేస్తానంటూ లోపలికి తీసుకెళ్లి తగలరాని చోట్ల తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. అత్యాచారానికి యత్నించడంతో భయపడిపోయిన ఆ యువతి పెద్దగా కేకలు పెట్టడంతో అతడు వదిలేశాడు.

కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఓ యువతి చికిత్సకోసం ఎర్రగడ్డ ఆయుర్వేద ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడ పని చేసే కాంట్రాక్టు ఉద్యోగి జండూబామ్ తో మర్దన చేస్తే నొప్పి తగ్గుతుందంటూ నమ్మించి గదిలోకి తీసుకెళ్లాడు. మర్దన పేరుతో అతడు శరీరమంతా తాకడం మొదలు పెట్టాడు. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించడంతో ఆమె పెద్దగా కేకలు పెడుతూ అతడి నుంచి తప్పించుకుని బయట పడి ఆస్పత్రి అధికారులకు ఫిర్యాదు చేసింది. ఆ ఉద్యోగి గతంలో కూడా పలువురి పట్ల ఇలాగే ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆస్పత్రికి రావడానికి కూడా భయమేస్తోందని, అతడి పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.