Begin typing your search above and press return to search.
బూతు కిట్టు అంటే ఏమో అనుకున్నా... ఇప్పుడు అర్థం అవుతుంది
By: Tupaki Desk | 13 Nov 2020 8:40 PM ISTతాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి సంబంధించినవని కొన్ని ఆడియో టేపులు కొన్ని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి. ఆ ఆడియో టేపుల పై తాజాగా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పందించారు. ఎవరో అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన ఆడియో టేపులను ఇష్టారీతిగా ప్రసారం చేస్తూ దళితులను, ఇతర వర్గాల మహిళలను కించపరిచేలా ఏబీఎన్ చానెల్ అధినేత రాధాకృష్ణ వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మండిపడ్డారు. ఈ ఆడియో టేపుల వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ... గతంలో ఓటుకు కోట్లు కేసులో బ్రీఫ్డ్ మీ అని చంద్రబాబునాయుడు రూ.5 కోట్ల విషయంలో అడ్డంగా వీడియో ఫుటేజీ లతో సహా దొరికినప్పుడు దాన్ని ఎందుకు ప్రసారం చేయలేదని ప్రశ్నించారు.
చంద్రబాబుకు ఏబీఎన్ చానెల్‌లో వాటా ఉండటం వల్లనే ... ఆ వీడియోలు ఏబీఎన్ లో ప్రచారం చేయలేదని అన్నారు. అలాగే తనపై అసత్య ప్రసారాలు చేస్తున్నారని, ప్రసారానికి ముందు తమ వివరణ అడగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందురూ రాధాకృష్ణను బూతు కిట్టూ అంటుంటే ఎందుకంటున్నారో అర్థమయ్యేది కాదని, ఇప్పుడు బాగా అర్థమవుతోందని అన్నారు. మీ చంద్రబాబేమో దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని అన్నారని, టీడీపీ నేతలేమో దళితులు శుభ్రంగా ఉండరు, చదువుకోరు అని కించపరిచారని మరోసారి గుర్తు చేశారు. బూతు ప్రసారాలు చేస్తున్నారు కాబట్టే ప్రజలు రాధాకృష్ణకు బూతుకిట్టు అనే బిరుదు ఇచ్చారు. ఇవే ఆడియోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి మీ తల్లినో, చెల్లినో, అక్కనో వెబ్ సైట్ లో పెడితే మీరు బాధపడరా అని సూటిగా రాధాకృష్ణను ప్రశ్నించారు. ఏదైనా ప్రసారం చేసే ముందు సంబంధిత వ్యక్తుల వివరణ తీసుకోండి. గత ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం ఎదురైనా కూడా ఇంకా అదే రీతిలో కొనసాగుతుంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ రాష్ట్రంలో పూర్తిగా కనుమరుగవుతుంది అని ఎమ్మెల్యే శ్రీదేవి తీవ్రంగా మండిపడ్డారు.