Begin typing your search above and press return to search.
ఏపీలో జగన్ చేసిన పని.. తెలంగాణలో కేసీఆర్ ఎందుకు చేయట్లేదు?
By: Tupaki Desk | 16 Dec 2020 12:00 PM ISTకేసీఆర్ చెప్పిందే వేదం.. ఆయన మాటకు రాష్ట్రంలో ఎదురు చెప్పే పరిస్థితి లేదన్న జమానా ముగిసి చాలా కాలమే అయ్యింది. ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది. ఆయన నోటి నుంచి వచ్చే మాటలకు దిమ్మ తిరిగే కౌంటర్లు పడటమే కాదు.. మాటల కోసం గులాబీ నేతలు దారులు వెతుక్కునే ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఎన్నికల వేళలో హామీ ఇచ్చిన రీతిలో పనులు చేయకపోగా.. కేంద్రాన్ని బద్నాం చేస్తున్న తీరును బీజేపీ నేతలు బట్టబయలు చేస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ మాటల్లోని డొల్లతనాన్ని కళ్లకు కట్టేలా చూపించారు అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు.
ఆదివాసీలు పోడు వ్యవసాయం చేసుకునే భూములకు పట్టాలు ఇస్తానని సీఎం కేసీఆర్ చెప్పారని.. కానీ.. ఆయనేమీ చేయలేదన్నారు. అదేమంటే.. ఈ అంశం కేంద్రం పరిధిలోకి వస్తుందని.. రాష్ట్రానికి సంబంధం లేదని చెబుతున్న బీజేపీ ఎంపీ.. సూటి ప్రశ్నను సంధిస్తున్నారు. ‘‘ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి..గెలిచిన తర్వాత మాట మారుస్తున్నారు. ఒకవేళ కేసీఆర్ చెప్పిందే నిజమైతే.. ఏపీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఎలా పట్టాలు ఇచ్చారు?’’ అని సూటిగా ప్రశ్నిస్తున్నారు.
తన మాటలతో కేసీఆర్ తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ట్రైబల్ వర్సిటీని అదిలాబాద్ జిల్లా నుంచి వరంగల్ జిల్లాకు తరలించి తమ జిల్లాకు అన్యాయం చేశారన్నారు. నీళ్లు.. నిధులు.. నియామకాలు అన్న నినాదం కేసీఆర్ సొంత కుటుంబానికే దక్కాయి తప్పించి మరెవరికి రాలేదన్నారు. రిటైర్ అయిన ఉద్యోగుల కారణంగా ఏర్పడ్డ ఖాళీల్ని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం రూ.1.5లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చూస్తుంటే.. కేసీఆర్ నోటి నుంచి వచ్చే ప్రతి అంశానని వదిలిపెట్టని బీజేపీ నేతల మాటలు గులాబీ దళానికి కొత్త దడ పుట్టిస్తున్నాయని చెప్పక తప్పదు.