Begin typing your search above and press return to search.

2 నిమిషాలకే డౌన్ అయ్యాడని మెడ కొరికేసింది

By:  Tupaki Desk   |   6 Oct 2020 2:00 PM IST
2 నిమిషాలకే డౌన్ అయ్యాడని మెడ కొరికేసింది
X
కొన్ని ఉదంతాల్ని వింటే నిజంగానే జరుగుతాయా? అన్న సందేహాలు గతంలో కలిగేవి. ఇటీవల కాలంలో సిత్ర.. విచిత్రాలు చోటు చేసుకుంటున్న వేళ.. కొత్త కొత్త దుర్మార్గాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఆ కోవకు చెందిందే ఈ ఉదంతం. సెక్స్ లో త్వరగా డౌన్ అయిన భర్త విషయంలో ఒక భార్య అనుసరించిన వైనం చూస్తే షాక్ తినాల్సిందే. అయితే.. ఇది జరిగింది మన దగ్గర కాదు.. అక్కడెక్కడో అల్లంత దూరాన ఉన్న మెక్సికోలో. ఇంతకూ ఏం జరిగిందంటే..

ఏడాది క్రితం జాన్ అనే వ్యక్తి స్టెఫి అనే యువతిని పెళ్లాడాడు. పెళ్లి చేసుకున్నాడే కానీ.. భార్యతో దాంపత్య జీవితాన్ని అనుభవించేవాడు కాదు. ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవాడు. తరచూ ఫారిన్ టూర్లు వెళ్లేవాడు. దీంతో మొదట్లో వర్క్ బిజీ అనుకున్న స్టెఫీ తర్వాత భర్త మీద సందేహం వచ్చి పాత ఎఫైర్లు ఏమైనా ఉన్నాయా? అంటే.. లేదని చెప్పాడు.

మరికొంతకాలం వెయిట్ చేసి.. చివరకు తనకు సెక్సు కోరికలు ఎక్కువగా ఉన్నాయని.. వాటిని తీర్చాలని కోరింది. దీనికి ఏదో చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసిన భర్తపై ఒత్తిడి తేవటంతో అతడు ఆమెతో రొమాన్స్ కు రెఢీ అయ్యాడు. అనూహ్యంగా రెండు నిమిషాలకే అతను డౌన్ కావటంతో షాక్ తిన్న స్టెఫీ ఏమైందని అడిగితే.. తనకు ఆ సామర్థ్యం తక్కువన్న విషయాన్ని చెప్పాడు.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె.. భర్తను ఇష్టారాజ్యంగా బాదేసింది. గొలుసులతో కట్టేసి మరి కొట్టటమే కాదు.. గోళ్లకు ఎక్కడ పడితే అక్కడ గీసేసింది. మెడ మీద కొరికేసింది. దీంతో.. అతగాడు హాహాకారాలు పెట్టటంతో పక్క ప్లాట్ లో ఉన్న యువకుడు ఏమైందన్న కంగారులో రావటం.. లోపల సీన్ చూసి షాక్ తిన్నాడు. పోలీసులకు కంప్లైంట్ చేయటంతో భర్తను ఆసుపత్రికి.. భార్యను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారట. విషయం లేనప్పుడు పెళ్లి చేసుకోవటం ఏందుకు.. అమ్మాయి గొంతు కోయటం ఎందుకు?