Begin typing your search above and press return to search.

ఆ గ్రామమంతా మరుగుజ్జులదే.. కారణం అదేనా?

By:  Tupaki Desk   |   21 Nov 2021 12:30 AM GMT
ఆ గ్రామమంతా మరుగుజ్జులదే.. కారణం అదేనా?
X
సహజంగా ఉండాల్సిన ఎత్తుకన్నా కాస్త తక్కువ ఉంటే పొట్టివాళ్లు అంటారు. హైట్ తక్కువగా ఉన్నామని వాళ్లు చాలా ఫీల్ అవుతుంటారు. ఇకపోతే పొట్టివాళ్ల కన్నా ఇంకా ఎత్తు తక్కువగా ఉండడం అనగా అసాధారణ స్థాయిలో తక్కువ ఎత్తుగా ఉండడాన్ని మరుగుజ్జుతనం అంటారు. ఇలాంటి వాళ్లను మనం చాలా అరుదుగా చూస్తుంటాం. ఈ మరుగుజ్జుతనానికి కారణాలు వివిధ రకాలుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే జన్యువుల ప్రభావం వల్ల చాలామంది ఈ అసాధారణ లక్షణాలను కలిగిఉంటారట. జన్యువు అసమతుల్యతే ప్రధాన కారణం అని కూడా వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఓ గ్రామంలో మాత్రం మొత్తం మరుగుజ్జులే ఉంటారట. కనీసం ఇంటికి ఒకరైనా ఇలా ఉంటారట. అలా ఎందుకు ఉంటారు? శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఏం తేలింది? స్థానికులు ఏమని చెబుతున్నారో తెలుసుకుందాం రండి..

మరుగుజ్జుల గ్రామం అత్యధిక జనాభా కలిగిన చైనా దేశంలో ఉంది. డ్రాగన్ కంట్రీలోని సిచువాన్ ప్రావిన్స్ లోని యాంగ్సి అనే గ్రామంలో మొత్తం మరుగుజ్జులే ఉంటారట. అందరు అలా ఎందుకు ఉంటారనే దానిపై శాస్త్రవేత్తలు కూడా వివిధ ప్రయోగాలు చేశారట. ఊరిలోని వారందరూ అలా పొట్టివారిగా పుట్టడానికి కారణాలు ఏమై ఉంటాయా? అనే కోణంలో వివిధ పరిశోధనలు చేశారు. అయితే ఇప్పటివరకు కూడా అందుకు గల కారణాలను తెలుసుకోకలేకపోయారు. సైన్స్ ఇంత అభివృద్ది చెందినా కూడా ఆ ఊరి రహస్యం మాత్రం శాస్త్రవేత్తలకు ఇంతవరకు చిక్కకపోవడం గమనార్హం.

యాంగ్సి గ్రామంలోని మరుగుజ్జుల అంశంపై వివిధ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అక్కడి వారు ఎవరితోచిన విధంగా వారు చెబుతున్నారు. కొన్నేళ్ల కిందట అర్ధరాత్రి వేళ మహమ్మారి ఐదు నుంచి ఏడు సంవత్సరాల వయసు గల పిల్లలకు సోకిందని స్థానికులు చెబుతున్నారు. ఇక అప్పటినుంచి పుట్టిన పిల్లల అందరూ కూడా ఇలాగే తక్కువ ఎత్తుతో పుడుతున్నారని వారు అంటున్నారు. అప్పుడు వచ్చిన అంటువ్యాధి దీనికి కారణం అని అభిప్రాయపడ్డారు. అయితే జపాన్ దేశం ఓ వాయువును చైనా మీద ప్రయోగించారని మరికొందరు అంటున్నారు. ఆ గ్యాస్ ప్రభావం వల్లే మరుగుజ్జుతనం వస్తోందని వారు తెలిపారు. అయితే దీనిపై ఎటువంటి ఆధారాలు లేదు. ఇక శాస్త్రీయంగా నిరూపించడానికి శాస్త్రవేత్తలకు కారణాలు అంతుచిక్కడం లేదు.

గ్రామం అంతా కూడా మరుగుజ్జులుగానే ఉండడం నిజానికే చాలా ఆశ్చర్యం కలిగించే అంశం. ఎందుకంటే మనం ఇక్కడ వేలల్లో ఒకరిని అలా చూస్తాం. అక్కడ ఉన్న వారంతా కూడా ఆ విధంగానే ఉండడంపై అనేక అనుమానాలు ఉన్నాయి. అందుకే ఆ ఊరిపై ప్రత్యేక పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇక మరుగుజ్జులకు పుట్టిన పిల్లలు సైతం మరుగుజ్జులుగానే ఉండడం వల్ల ఊరంతా కూడా మరుగుజ్జులుగానే ఉండిపోతున్నారు. దీనిపై శాస్త్రీయ ఆధారాలు లభిస్తే అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవచ్చని అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే గ్రామంలోని వారంతా మరుగుజ్జులుగానే ఉండడం వల్ల తాము ఎలాంటి ఆత్మన్యూనత భావానికి గురి అవబోమని వారు చెబుతున్నారు.