Begin typing your search above and press return to search.
14.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.510 కోట్లు జమ : సీఎం జగన్ !
By: Tupaki Desk | 17 Nov 2020 5:20 PM ISTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల కోసం , రైతుల కోసం ఎన్నో మంచి పనులు చేశారు. తాజాగా రైతుల కోసం మరో అద్భుత పథకాన్ని తీసుకొచ్చారు. ఈ రోజు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం చెల్లింపులను సీఎం జగన్ మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు. పంట రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ పూర్తిగా చెల్లించారు. 14.58 లక్షల రైతుల ఖాతాల్లో 510 కోట్ల రూపాయలకు పైగా జమ చేశారు. అక్టోబర్ లో దెబ్బతిన్న పంటలకు కూడా పెట్టుబడి రాయితీని కూడా విడుదల చేశారు. కేవలం 30 రోజుల్లోనే 132 కోట్ల రూపాయల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేశారు. ఈ ఖరీఫ్‌లో పంట నష్టాలపై ఇప్పటివరకు పూర్తి ఇన్ పుట్ సబ్సిడీ చెల్లింపులు జరిపారు.
ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతులకు ఎంత చేసినా తక్కువే అని , రైతుల అకౌంట్లలో నేరుగా డబ్బు జమ అవుతుందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలని ఇప్పటివరకు 90 శాతానికి పైగా హామీలను నెరవేర్చామన్నారు. గతంలో రైతులకు భరోసా ఇచ్చిన ప్రభుత్వాలు లేవని జగన్ అన్నారు. రైతుభరోసా కింద 13,500 రూపాయలు ఇస్తున్నామని , పంట రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ పూర్తిగా చెల్లిస్తున్నామని, రుణమాఫీ వాగ్దానాన్ని ఎలా అటకెక్కించారో గతంలో మనం చూశామని టీడీపీ పై విమర్శలు కురిపించారు. గత ప్రభుత్వం సున్నవడ్డీపై పెట్టిన 1180 కోట్ల రూపాయల ఆ బకాయిలన్నింటినీ మేమే చెల్లించామని , ఏ సీజన్ లో పంట నష్టపోతే, అదే సీజన్ లో రైతులను ఆదుకుంటున్నాం అంటూ చెప్పుకొచ్చారు. పగటిపూటి ఉచితంగా 9 గంటల విద్యుత్ ఇస్తున్నాం. రైతులకు బీమా కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది.147 ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నాం అని ప్రకటించారు.