Begin typing your search above and press return to search.

టీమిండియా కోచ్​ గా మిస్టర్​ డిపెండబుల్​ .. కానీ కేవలం ఒక్కటూర్​ కే..!

By:  Tupaki Desk   |   20 May 2021 12:30 PM GMT
టీమిండియా కోచ్​ గా మిస్టర్​ డిపెండబుల్​ .. కానీ కేవలం ఒక్కటూర్​ కే..!
X
మిస్టర్​ డిపెండబుల్​ రాహుల్​ ద్రవిడ్​ కు బంపర్​ ఆఫర్​ దక్కింది. టీమిండియా కోచ్​ గా ఆయన పేరు ఫైనల్​ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం రవిశాస్త్రి టీమిండియాకు హెడ్​కోచ్​ గా వ్యవహరిస్తున్నారు. అయితే టీమిండియా త్వరలో ఇంగ్లండ్​, శ్రీలంక టూర్​ కు వెళ్లనున్నది. ఇంగ్లండ్​ టూర్​ కు కోహ్లీ సేన వెళ్తుండగా.. శ్రీలంక టూర్​ కు యువ ఆటగాళ్లు వెళ్లబోతున్నట్టు సమాచారం. దీంతో యువ ఆటగాళ్ల జట్టుకు .. రాహుల్​ ద్రవిడ్​ కోచ్​గా వ్యవహరించబోతున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇంకా అధికారిక సమాచారం రాలేదు. కానీ జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

రాహుల్​ ద్రవిడ్​ యువ ఆటగాళ్లతో అయినా.. సీనియర్​ ఆటగాళ్లతోనయినా సత్సంబంధాలు నెరుపుతాడు. దీంతో అతడికి అవకాశం దక్కినట్టు సమాచారం. ప్రస్తుతం ద్రవిడ్​ నేషనల్​ క్రికెట్​ అకాడమీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.

అయితే జూలైలో శ్రీలంకలో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ లకు ద్రావిడ్ కోచ్‌ గా వ్యవహరించనున్నట్టు సమాచారం. ద్రవిడ్ గతంలోనూ టీమిండియాకు కోచ్‌ గా పనిచేశారు. 2014లో ఇంగ్లండ్‌తో జరిగిన పర్యటనలో ద్రావిడ్ బ్యాటింగ్ కన్సల్టెంట్‌ గా జట్టుతో పాటు వెళ్లారు.

ఇంగ్లాండ్​ టూర్​ కు సంబంధించి ఇప్పటికే భారత జట్టును ఎంపిక చేశారు. ఇంకా శ్రీలంకకు వెళ్లబోయే జట్టును పూర్తిస్థాయిలో ఎంపిక చేయలేదు. అయితే శ్రీలంక వెళ్లబోయే జట్టుకు శిఖర్​ ధవన్​ కెప్టెన్​ గా వ్యవహరించబోతున్నట్టు సమాచారం.

శ్రీలంక పర్యటనలో టీమ్ ఇండియా మూడు వన్డేల సిరీస్, టి 20 మ్యాచ్ లను ఆడవలసి ఉంటుంది. అయితే జట్టులోకి తిరిగి రావాలనుకుంటున్న ప్లేయర్స్‌కి ఇది మంచి అవకాశం. ఈ సిరీస్‌ లో అన్ని మ్యాచ్‌లు కొలంబోకు చెందిన ప్రేమదాస స్టేడియంలో జరుగుతాయి.

వన్డే సిరీస్ జూలై 13, 16, 19 తేదీల్లో జరుగుతుంది. కాగా టీ 20 మ్యాచ్‌ లు జూలై 22 నుంచి 27 వరకు జరుగుతాయి. మరోవైపు, ఐసీసీ ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌, ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జంబో జట్టు జూన్ 2న ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇందుకోసం 24 మందితో కూడిన జట్టును బీసీసీఐ కొన్ని రోజుల కింద ప్రకటించిన విషయం తెలిసిందే.