Begin typing your search above and press return to search.

పేస్ బుక్ పై కీలక వ్యాఖ్యలు చేసిన 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' !

By:  Tupaki Desk   |   26 Aug 2020 6:00 PM IST
పేస్ బుక్ పై కీలక వ్యాఖ్యలు చేసిన ది వాల్ స్ట్రీట్ జర్నల్ !
X
ప్రపంచ సోషల్ మీడియా అగ్ర సంస్థల్లో ఒకటైన ఫేస్ బుక్ పై గత కొన్ని రోజులుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేస్ బుక్ కొందరికి అనుకూలంగా పనిచేస్తుంది అనే ఆరోపణలు ఎక్కువుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్వేషాన్ని రెచ్చగొట్టే అంశాలని పేస్ బుక్ ప్రచురించి ఎన్నో కారణాలకి పరోక్ష కారణంగా నిలుస్తుందని చెప్తూ ..అమెరికన్ మీడియా సంస్థ ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కధనం ప్రచురించింది. భారత్ తో పాటు పలు దేశాల్లో ఆ సంస్థ విద్వేషాలను రగిల్చే..హింసను ప్రేరేపించే వీడియోలు కంటెంట్ ను ప్రచురించినట్లు వివరించింది. అమెరికా ఆదేశాల మేరకు ఫేస్ బుక్ ఇలా చేస్తున్నట్లు తెలుస్తూండగా తాజాగా జర్మనీ ఎన్నికల విషయంలో కూడా ఫేస్బుక్ పరోక్షంగా కలుగజేసుకుని ఉంటుందని తెలిపింది.

ఇకపోతే ఈ మద్యే కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ కూడా పేస్ బుక్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. భారత్ లో ఫేస్ బుక్, వాట్సప్ లను బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ లు నియంత్రిస్తున్నాయని అమెరికా మీడియా సంస్థ ది వాల్ స్ట్రీట్ జర్నల్ కొద్దిరోజుల ముందు ప్రచురించిన . సోషల్ మీడియా వేదికలైన ఫేస్ బుక్, వాట్సాప్ లను మన దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు తమ గుప్పిట్లో పెట్టుకుని నియంత్రిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా దేశంలో తప్పుడు వార్తలను, విద్వేషాలను రెచ్చగొట్టే రీతిలో, బిజేపి, ఆర్.ఎస్.ఎస్ దుష్ప్రచారం చేస్తున్నాయని ట్విట్టర్లో పేర్కోన్నారు. చివరకు అమెరికా మీడియా ఈ బండారాన్ని బయటపెట్టిందని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. విద్వేష పూరిత ప్రసంగాల విషయంలో ఏం చేయదలచుకున్నారో ఫేస్‌బుక్‌ చెప్పాలని ఆయన అన్నారు. ఈ విషయం మీద స్పందించిన ఫేస్ బుక్ విద్వేష పూరిత ప్రసంగాలకు సంబంధించిన విధానాలను ఖచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించింది. వారు ఏ రాజకీయ పదవిలో ఉన్నా, ఏ రాజకీయ పార్టీ కి చెందిన వారైనా “విద్వేష పూరిత ప్రసంగాలు” చేస్తే నిబంధనలకనుగుణంగా చర్యలు తీసుకుంటామని”, “ఫేస్ బుక్ ప్రకటించిన సంగతి తెలిసిందే.