Begin typing your search above and press return to search.

వైరస్​ కు దయ - జాలి ఏమీ ఉండవు.. డబ్ల్యూహెచ్​ వో చీఫ్ వార్నింగ్​

By:  Tupaki Desk   |   10 Nov 2020 4:00 PM GMT
వైరస్​ కు దయ - జాలి ఏమీ ఉండవు..  డబ్ల్యూహెచ్​ వో చీఫ్ వార్నింగ్​
X
కరోనా వైరస్ ఎంత ప్రమాదకరో మరోసారి డబ్ల్యూహెచ్ వో చీఫ్ తన వ్యాఖ్యల ద్వారా ప్రజలను హెచ్చరించారు. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది.. వైరస్ తీవ్రత అంతగా లేదు.. ఇప్పుడు సోకినా ఏమీ కాదు..అంటూ విచ్చలవిడిగా బయట తిరుగుతున్న జనాలకు డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్​ ఒక అలర్ట్ మెసేజ్ ఇచ్చారు. అలసట మనకు రావాల్సిందే కానీ. కరోనా వైరస్ కు రాదంటూ.. ఇండైరెక్టుగా వ్యాధి తీవ్రత రేంజ్ ఏంటో తెలియజేశారు. చలికాలం ముంచుకొస్తుండటంతో కరోనా తీవ్రత కూడా పెరుగుతున్నది. కొంతకాలంగా కేసుల సంఖ్య తగ్గిందని భావిస్తున్న తరుణంలో తాజాగా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి.

ఇటీవలే అమెరికాలో కరోనా కేసుల సంఖ్య కోటిని దాటింది. మరో వైపు యూరప్​ దేశాల్లోనూ సెకండ్​ వేవ్​ ముంచుకొస్తున్నది. కరోనా మరణాల సంఖ్య పెరగడం కూడా ఆందోళన కలిగిస్తున్నది. వ్యాక్సిన్​ పై ఎప్పుడొస్తుంది అనే విషయంపై ఏ దేశం కూడా స్పష్టమైన ప్రకటన జారీ చేయలేదు. అయితే ఇటీవల ప్రజల్లో కరోనా విషయంలో కొంత సీరియస్​నెస్​ తగ్గిందని చెప్పవచ్చు. పండగలు, వేడుకల పేరుతో ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. భౌతికదూరంగా, మాస్కులు మరిచి తిరుగుతున్నారు. దీంతో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై డబ్ల్యూహెచ్​వో స్పందించింది. కరోనా కేసుల సంఖ్య పెరగడంపై ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్​ టెడ్రోస్​ ఏమన్నారంటే.. ‘కరోనాపై పోరాటంతో మనం అలసిపోయి ఉండొచ్చు కానీ వైరస్​కు ఏ మాత్రం అలసట ఉండదు. అందరూ వైరస్​పై పోరాటాన్ని కొనసాగించాల్సిందే. బలహీన ఆరోగ్యవ్యవస్థ ఉన్న వారిపై వైరస్​ ఏ మాత్రం జాలి చూపదు. తన పని తాను చేసుకుపోతుంది. మన ముందున్న ఏకైక ఆశ సైన్స్​ మాత్రమే. ప్రపంచ దేశాలన్నీ ఉమ్మడి ప్రయోజనం కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. వ్యాక్సిన్​ వచ్చేవరకు జాగ్రత్తగా ఉండాల్సిందే’ అని ఆయన పేర్కొన్నారు.