Begin typing your search above and press return to search.
వరద వార్షికోత్సవం జరుపుకుంటున్న ఆ గ్రామం .. అసలు సంగతి ఏంటంటే ?
By: Tupaki Desk | 15 Oct 2020 2:30 PM ISTఅరెరే వరద వార్షికోత్సవమా ..అదేంటి మా ఊర్లో ఎప్పుడు కూడా ఇలాంటి వార్షికోత్సవం జరపలేదు , ఎలా చేస్తారో ఏమో అనుకుంటున్నారా ! అయితే , ఈ వరద వార్షికోత్సవం మీరనుకుంటున్నట్టు వివాహ వార్షికోత్సవం , లేదా ఏదైనా సంస్థల వార్షికోత్సవంలా చేయరు లెండి. ఈ వరద వార్షికోత్సవం వెనుక పెద్ద కథే ఉంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం ..
ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం దగ్గరలో ఉన్న గొల్లప్రోలు గ్రామ ప్రజలు ఈ వరద వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. అంతేకాదు, ఆ వార్షికోత్సవానికి విచ్చేస్తున్న ప్రజా ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ బ్యానర్లు కూడా కట్టేశారు. అసలు సంగతి ఏమిటంటే .. ఆ గ్రామం గత 30 సంవత్సరాలుగా తమ గ్రామం వరదనీటిలో మునిగిపోతుందని, ఈ ఏడాది కూడా వరద ముంపులో మునిగిపోయిందని ఆ గ్రామస్థులు ఎంతో ఆవేదన చెందుతున్నారు. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా తమ గ్రామాన్ని సందర్శించేందుకు ప్రజాప్రతినిధులు రాబోతున్నారని, వారు వస్తున్నారు…చూస్తున్నారు…వెళుతున్నారు….అని దెప్పిపొడుస్తూ ఊరి పొలిమేరలో బ్యానర్ కట్టారు ఆ గ్రామ ప్రజలు.
ప్రస్తుతం ఈ వరద వార్షికోత్సవం బ్యానర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమ గ్రామానికి ఇది 30వ వరద వార్షికోత్సవం అని, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తమ ఈబీసీ కాలనీ వరదను తిలకించడానికి విచ్చేయుచున్న ప్రజా ప్రతినిధులకు ఇదే మా స్వాగతం అని ఆ ఊరి ప్రజలు కట్టిన బ్యానర్ ఇపుడు ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. ప్రజాప్రతినిధులు వస్తున్నారు. చూస్తున్నారు, వెళుతున్నారు అంటూ గొల్లప్రోలు ఈబీసీ కాలనీ ప్రజలు తమ బాధను, ఆవేదనను, నిరసనన వ్యక్తం చేస్తూ వెటకారంగా వ్యక్తం చేశారు.ఇకనైనా తమ గ్రామాన్ని వరదనీరు ముంచెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు. చూడాలి మరి ఆ బ్యానర్ చుసిన తరువాతైనా అక్కడి నాయకుల్లో మార్పు వస్తుందేమో .